Begin typing your search above and press return to search.

హాట్స్ అఫ్ విజయ్!

By:  Tupaki Desk   |   20 July 2018 12:46 PM IST
హాట్స్ అఫ్ విజయ్!
X
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో పాత్రలు ఎవరైనా చేస్తారు. అదేమి పెద్ద విశేషం కాదు. కానీ ఛాలెంజింగ్ అనిపించే పాత్రలను చేయటం అంటే నటనలోనే కాదు చాలా రకాల ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం శంకర్ తీసిన భారతీయుడులో వృద్ధుడైన సేనాపతిగా కమల్ హాసన్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. దానికి కారణం ప్రొస్థెటిక్స్ మేకప్. ఇప్పుడు ఈ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. శంకర్ ఐలో కురూపిగా కనిపించడానికి విక్రమ్ ఏకంగా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ఇప్పుడు మరో తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఇదే బాటలో పయనిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సీతకాతి అనే తమిళ సినిమా కోసం వయో వృద్ధుడిగా తన కెరీర్లో ఇంతకుముందెన్నడూ చేయని పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి దాని మేకప్ కోసం ఎంత కష్టపడుతోంది వీడియో రూపంలో విడుదల చేసింది యూనిట్

ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అలెక్స్ నోబుల్-కెవిన్ హనే నేతృత్వంలో ఈ ప్రక్రియ గంటల తరబడి సాగుతోంది. దీంట్లో విజయ్ సేతుపతి అంత ఓపిగ్గా కూర్చుకుని బాధను ఓర్చుకుంటూ కొత్తగా పరకాయ ప్రవేశం చేసిన తీరు నిజంగా అబ్బురపరుస్తుంది. తెలుగులో సైరా నరసింహరెడ్డితో చిరంజీవితో కలిసి నటించబోతున్న విజయ్ సేతుపతి త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు. వచ్చే వారం 27 విజయ్ సేతుపతి కొత్త సినిమా జుంగా విడుదల కాబోతోంది. అతని సినిమాలన్నింటిలోకి దీని మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే కార్తీ చినబాబులో నటించిన సాయేషా సైగల్ ఇందులో హీరోయిన్. తెలుగులో విజయ్ సేతుపతికి మార్కెట్ లేని నేపథ్యంలో డబ్ చేసే ఆలోచనలో లేరు నిర్మాతలు. ఒకవేళ హిట్ అయితే వేరే హీరోతో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.