Begin typing your search above and press return to search.

డబుల్ హ్యాట్రిక్ అనుకుంటే.. డిజాస్టర్ ఎదురైంది

By:  Tupaki Desk   |   8 Oct 2016 5:30 PM GMT
డబుల్ హ్యాట్రిక్ అనుకుంటే.. డిజాస్టర్ ఎదురైంది
X
నేచురల్ స్టార్ నాని ఏడాదిన్నర వ్యవధిలో వరుసగా ఐదు హిట్లు కొట్టాడు. గత రెండు మూడు దశాబ్దాల్లో మరే తెలుగు హీరోకూ ఇలాంటి ఘనత సాధ్యం కాలేదు. ఐతే అవతల ఓ తమిళ హీరో నానిని మించి పోయాడు. కేవలం ఎనిమిది నెలవ వ్యవధిలోనే ఐదు హిట్లు కొట్టి ఔరా అనిపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సేతుపతి’తో మొదలుపెట్టి సెప్టెంబర్లో ‘ఆండవన్ కాట్టలై’ వరకు అతను చేసిన ఐదు సినిమాలూ హిట్లే. తాజాగా దసరాకు ‘రెక్కా’ అనే సినిమా షెడ్యూల్ అయింది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి డబుల్ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించడం ఖాయం అనుకున్నారంతా.

కానీ ‘రెక్కా’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రతిన శివ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘రెక్కా’ గురించి టాక్ చాలా బ్యాడ్ గా ఉంది. రివ్యూలు కూడా నెగెటివ్ గానే వచ్చాయి. మరోవైపు దసరాకు భారీ అంచనాలతో వచ్చిన శివ కార్తికేయన్ మూవీ ‘రెమో’ కూడా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయబోతుండటం విశేషం. మరి నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా.. పైగా మనకు పరిచయం లేని హీరో.. దిల్ రాజు ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. ఈ రెంటి మధ్య పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘అభినేత్రి’ తమిళ వెర్షన్ ‘దేవి’ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ అడ్వాంటేజిని ఉపయోగించుకుని ‘దేవి’ అక్కడ పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/