Begin typing your search above and press return to search.

రిలీజ్ కోసం విజయ్ 4 కోట్లు ఇచ్చాడట!!

By:  Tupaki Desk   |   6 Oct 2018 4:24 PM GMT
రిలీజ్ కోసం విజయ్ 4 కోట్లు ఇచ్చాడట!!
X
విజయ్ సేతుపతి కొత్త సినిమా '96' అక్టోబర్ 4 న రిలీజ్ అయింది. ఇప్పటికే మంచి టాక్ తో.. సూపర్ రివ్యూస్ తో సినిమా తమిళనాట ఒక హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాను తెలుగు లో రీమేక్ చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రైట్స్ తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. అంతా బాగుంది కానీ ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట.

నిర్మాత 4 కోట్ల పైగా ఫైనాన్స్ డ్యూస్ క్లియర్ చేస్తే గానీ రిలీజ్ కాని పరిస్థితి ఏర్పడడంతో హీరో విజయ్ సేతుపతి ఆ నాలుగు కోట్ల రూపాయలు తన సొంత డబ్బు ఇచ్చి రిలీజ్ అయ్యేలా చూశాడట. అంతే కాకుండా సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ల్యాబ్ లో స్వయంగా పనులు సూపర్వైజ్ చేశాడట. రిలీజ్ కు ముందు కూన్ని రోజులు రాత్రిపగలు తేడాలేకుండా సినిమా రిలీజ్ కు కష్టపడితేనే '96' థియేటర్ల లోకి వచ్చిందని సమాచారం.

ఇంత కష్టపడినందుకు '96' కు సూపర్ హిట్ టాక్.. వండర్ఫుల్ రివ్యూస్ వచ్చాయి. విజయ్ సేతుపతి - త్రిష లకే కాకుండా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కి కూడా మంచి పేరు వచ్చింది. 22 ఏళ్ళ తర్వాత కలిసిన మాజీ ప్రేమికుల కథతో తెరకెక్కిన '96' ఇప్పుడు తమిళ నాట అంతా హాట్ టాపిక్ అయింది. నిర్మాత కాకున్నా బాధ్యత తీసుకుని మరీ సినిమా రిలీజ్ కు సహకారం అందించినందుకు సేతుపతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.