Begin typing your search above and press return to search.

తమిళ సేతుపతి సరసన మల్లూ కుట్టి

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:09 AM GMT
తమిళ సేతుపతి సరసన మల్లూ కుట్టి
X
మలయాళ భామల అదృష్టం ఏంటో గానీ - వాళ్ళకు జయాపజయాలతో పని ఉండదు. అందమైన అభినయం - అభినయానికి తగ్గ అందం. ఆ టాలెంట్ తోనే ఆ సుందరీమణులంతా ఇప్పుడు సౌత్ స్ర్కీన్ ను ఏలుతున్నారు. వరుస విజయాలొచ్చినా - కట్టకట్టుకొని ఒకేసారి పరాజయాలు ఎదురైనా ఆఫర్స్ మాత్రం ఆగవు. అనూ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఉంది. పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - విశాల్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి - విజయ దేవరకొండ లాంటి వర్ధమాన స్టార్స్ తో కూడా నటించడానికి సిద్ధపడుతున్న ఈ బ్యూటీ - ట్రాక్ రికార్డు ప్రకారం చూసుకుంటే, నిజానికి అవకాశాల్లేకుండా ఖాళీగా ఉండాలి. కానీ తన అందంతో ఎప్పటికప్పుడు అవకాశాలు మాత్రం భలే అందిపుచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అమ్మడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సరసన ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందులోని ఆమె పాత్ర విపరీతంగా నచ్చేసి విజయ్ సేతుపతితో రొమాన్స్ కు సిద్ధపడుతోందని సమాచారం.

ఇటీవల విడుదలై సూపర్ హిట్టయిన ‘గీతగోవిందం’ లో చిన్న కేమియో రోల్ పోషించిన అనూ ఇమ్మాన్యుయేల్ ఆ మాత్రం రోల్ కే దాదాపు 40లక్షలు డిమాండ్ చేసిందట. ఇక ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలోనూ పెద్ద ఎత్తున పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అనూ ఇమ్మాన్యుయేల్ కు ట్రాక్ రికార్డు సరిగా లేకపోయినా..సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ భలేగా ఉంది.