Begin typing your search above and press return to search.

విజయ్ ది అందులో తమిళుడి పాత్ర!

By:  Tupaki Desk   |   2 Sep 2018 10:54 AM GMT
విజయ్ ది అందులో తమిళుడి పాత్ర!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' అనే బ్రిటిష్ ఇండియా నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక తమిళుడట. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి కుడి భుజంగా ఉంటూ బ్రిటిష్ వారిని ఎదుర్కొంటాడట. కథ ప్రకారం ఆ పాత్ర తమిళుడిది కావడంతో నటుల ఎంపిక సమయంలో 'సైరా' టీమ్ అంతా విజయ్ సేతుపతికే వోట్ వేయడం జరిగిందట. కోలీవుడ్ లో ఉన్న బిజియెస్ట్ హీరోలలో సేతుపతి ఒకరయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో - తన పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉండడంతో ఎక్కువ సమయం తీసుకోకుండా సినిమాకు సైన్ చేశాడట.

విజయ్ సేతుపతి సినిమాలు చూసిన వారికి అతను ఎలాంటి నటుడో తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు.. అయనకు పక్కగా సేతుపతి ఉండి అదొక పవర్ఫుల్ సీన్ అయితే ఆ సీన్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏదేమైనా 'సైరా' లో సేతుపతి పాత్ర ఎలా ఉందో తెలియాలంటే మనం రిలీజ్ వరకూ వేచి చూడక తప్పదు.