Begin typing your search above and press return to search.

తంబీ సేతుపతి హిందీ ప‌రిశ్ర‌మనూ వ‌దిలి పెట్ట‌డా?

By:  Tupaki Desk   |   9 Oct 2020 11:30 PM GMT
తంబీ సేతుపతి హిందీ ప‌రిశ్ర‌మనూ వ‌దిలి పెట్ట‌డా?
X
లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన‌ `మానగరమ్` బాలీవుడ్ రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిని బాలీవుడ్ లో సంతోష్ శివన్ నిర్మించున్నార‌ని సమాచారం. తాజా అప్ డేట్ ప్రకారం.. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో భాగం కానున్నార‌ని తెలుస్తోంది. 2017 లో విడుదలైన మానగరం హిందీ రీమేక్ లో కీలక పాత్రను అత‌డు పోషించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. అయితే దీని గురించి మేకర్స్ ఇంకా అధికారికంగా మాట ఇవ్వలేదు.

`మానగరమ్` హిందీ రీమేక్ లో విక్రాంత్ మాస్సీ సందీప్ కిషన్ పాత్రను పోషించ‌నున్నారు. తమిళ చిత్రంలో సుందీప్ కిషన్ - రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. చార్లె.. మధుసూధన్ రావు .. వివేక్ త‌దిత‌రులు సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం జావేద్ రియాజ్ సమకూర్చారు. ఇదిలా ఉండ‌గానే.. లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ మాస్టర్ లోనూ సేతుప‌తి కనిపించనున్నారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2021 లో రిలీజ్ కానుంది. జేవియర్ బ్రిట్టో తన హోమ్ బ్యానర్ ఎక్స్‌.బి ఫిల్మ్ క్రియేటర్స్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ద‌ళ‌పతి విజయ్ .. విజయ్ సేతుపతి న‌డుమ మాళ‌విక‌ మోహనన్ .. ఆండ్రియా జెరెమియా నాయిక‌లుగా న‌టిస్తున్నారు.

సేతుప‌తి అటు త‌మిళం .. ఇటు తెలుగు.. రెండు చోట్లా బిజీ బిజీ. మ‌రోవైపు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఆఫ‌ర్లు అందుకుంటున్నాడు. ఇంత బిజీ షెడ్యూళ్ల‌ను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడో అత‌డే చెప్పాలి.