Begin typing your search above and press return to search.
తమిళ హీరో తెలుగు సినిమా కన్ఫర్మ్
By: Tupaki Desk | 6 Jun 2020 7:00 PM ISTతమిళ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో రెగ్యులర్ కనిపిస్తూ వస్తున్నాడు. తెలుగులో ఈయన చేసినవి సైరా మరియు ఉప్పెన సినిమాలే అయినా కూడా మంచి పబ్లిసిటీ దక్కింది. అందుకే ఈ అరవ హీరోతో ఒక తెలుగు సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి వారు ఆ సినిమాలో నటించిన విజయ్ సేతుపతితో మరో సినిమాకు గాను అగ్రిమెంట్ చేసుకున్నారట.. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి కోసం స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారు. ఈ నెలలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాబోతుందట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ సేతుపతి హీరోగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈమద్య కాలంలో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్న మైత్రి మూవీస్ వారు విజయ్ సేతుపతితో కూడా ఒక విలక్షణమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారట. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ ‘పుష్ప’ చిత్రంతో పాటు పలు సినిమాల నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ ల కాంబో మూవీని కూడా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ నుండి విజయ్ సేతుపతి మూవీ వస్తుందనే వార్తలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.