Begin typing your search above and press return to search.
దెయ్యానికి గెస్ట్ గా వెళ్తున్న విజయ్ సేతుపతి..!
By: Tupaki Desk | 26 Feb 2021 1:00 PM ISTఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ మామూలుగా లేదు. తమిళంలో తిరుగులేని మక్కల్ సెల్వన్.. ఇప్పుడు తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ అవుతున్నాడు. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుస ఆఫర్లు వచ్చేస్తున్నాయి. అటు బాలీవుడ్ నుంచీ అవకాశాలు వచ్చేస్తున్నాయి. దీంతో.. సేతుపతి క్యాలెండర్ ఖాళీగా కనిపించట్లేదు.
ఇప్పటికే ఉన్న కమిట్ మెంట్స్ తో సేతుపతి చాలా బిజీగా ఉన్నాడు. దీంతో.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మంచి మంచి ఆఫర్లను కూడా వదులుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా నుంచి కూడా ఇలాగే తప్పుకున్నాడట.
అయితే.. అనూహ్యంగా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా.. బాలీవుడ్ లో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పేశాడట సేతుపతి. ఇందులో కత్రినా కైఫ్ తో కలిసి నటించనున్నాడు.
ఇప్పుడు ఓ హారర్ సినిమాలో గెస్ట్ రోల్ కు కూడా పచ్చజెండా ఊపడం విశేషం. ‘పిసాసు’పేరుతో తమిళ్ లో 2014లో వచ్చిన చిత్రం అనూహ్యమైన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు పిసాసు- 2 వస్తోంది. అయితే.. ఇందులో అతిథి పాత్రకు సంప్రదించగా.. ఓకే చెప్పేశాడట మక్కల్ సెల్వన్.
మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, రాజ్‌కుమార్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో ఈ టీంతో కలవనున్నాడు విజయ్ సేతుపతి. కాగా.. ఉప్పెనతో టాలీవుడ్ లో సేతుపతి లెవల్ మరింతగా పెరగడంతో.. ఆయన హిట్ మూవీ ‘సూపర్ డీలక్స్’ను తెలుగులో డబ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇందులో సమంత, ఫహద్ ఫాసిల్, రమ్యకృష్ణ కూడా నటించారు.