Begin typing your search above and press return to search.

హిజ్రా వేషంలో చించేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   29 March 2019 6:49 AM GMT
హిజ్రా వేషంలో చించేశాడ‌ట‌
X
రొటీన్ గా న‌టిస్తే పట్టించుకునేదెవ‌రు? అందుకే డిఫ‌రెంట్ దారిలో వెళ్లేందుకు.. కొత్త వేషాలు వేసేందుకు స్టార్లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్రేక్ష‌కుడి మ‌న‌సుపై ఘాడ‌మైన ముద్ర వేసే పాత్ర‌ల్లో న‌టించేందుకు ఉత్సాహం క‌న‌బ‌రుస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్, అమీర్ ఖాన్, విక్ర‌మ్ వంటి స్టార్లు ప్ర‌యోగాల బాట‌లో పెద్ద స‌క్సెస‌య్యారు. ఇప్పుడు అదే బాట‌లో న‌వ‌త‌రం హీరో విజ‌య్ సేతుప‌తి అంతే పెద్ద స‌క్సెస‌వుతున్నాడు. సినిమా సినిమాకి అత‌డు కొత్త గెట‌ప్పులతో అభిమానుల్ని అల‌రిస్తున్నాడు. ప్ర‌త్యేకంగా త‌న గురించే క్రిటిక్స్ లో చ‌ర్చ సాగేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. పొగ‌డ్త‌లు.. అవార్డులు అందుకుంటూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు.

న‌టించే ప్ర‌తి సినిమాకి ఊస‌ర‌వెల్లిలా వేషం మార్చేస్తున్న సేతుప‌తి పేరు ప్ర‌స్తుతం కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో మార్మోగిపోతోంది. అత‌డు న‌టించిన‌ గ‌త అర‌డ‌జ‌ను సినిమాల్ని ప‌రిశీలిస్తే మ‌ణిరత్నం `న‌వాబ్`లో పైకి క‌నిపించ‌ని తుంట‌రి పోలీసోడిగా అద్భుతంగా న‌టించాడు. న‌వాబ్ గిరీ కోసం కొట్టుకునే మొత్తం గ్యాంగ్ స్ట‌ర్ల‌ను ఏసేసి చివ‌రికి తానే హీరో అయ్యాడు. త్రిష అవార్డుల సినిమా 96 లోనూ మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. `సీత‌క‌త్తి` చిత్రంలో భార‌తీయుడు సేనాప‌తి గెటప్ తో మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఆ రెండు సినిమాల్లో న‌ట‌న‌కు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

తాజాగా `సూప‌ర్ డీల‌క్స్` చిత్రంతోనూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాలో హిజ్రా పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌కు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌రో మాస్ట‌ర్ పీస్ అంటూ క్రిటిక్స్ ప్ర‌శంసించ‌డ‌మే గాక‌.. సేతుప‌తి యాక్టింగ్ స్కిల్స్ ని పొగిడేస్తున్నారు. ఈ చిత్రంలో స‌మంత పాత్ర‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక సూప‌ర్ డీల‌క్స్ త‌ర్వాతా సేతుప‌తి ఎలాంటి ప్ర‌యోగాలు చేయ‌బోతున్నాడు? అన్న ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. మెగాస్టార్ `సైరా` చిత్రంలోనూ విజ‌య్ సేతుప‌తి విల‌క్ష‌ణ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత‌డి లుక్ రిలీజై ప్ర‌శంస‌లు అందుకుంది. ఇదం పొరుల్ యెవ‌ల్‌, సింధుబాధ్, మామ‌నిధాన్ స‌హా మ‌రో రెండు చిత్రాల్లోనూ విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. వ‌రుస‌గా ఐదారేళ్ల పాటు అత‌డి డైరీ ఫుల్ అన్న మాటా వినిపిస్తోంది.