Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌ డబ్బింగ్‌ పూర్తి

By:  Tupaki Desk   |   27 May 2022 3:30 AM GMT
సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌ డబ్బింగ్‌ పూర్తి
X
ఎనిమిది సంవత్సరాల క్రితం తమిళంలో వచ్చిన పిసాసు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హర్రర్‌.. థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ తో పిసాసు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ సమయంలో అలరించిన విషయం తెల్సిందే. ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌ ను రూపొందించారు. పిసాసు 2 అనే టైటిల్‌ తో రూపొందిన ఈ సినిమాను కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

పిసాసు 2 ను తెలుగు లో పిశాచి 2 అనే టైటిల్‌ తో విడుదల చేయబోతున్నారు. తెలుగు లో ఈ సినిమా డబ్బింగ్‌ రైట్స్ దక్కించుకుని దిల్‌ రాజు విడుదల చేయబోతున్నాడు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం తో యూనిట్‌ సభ్యులు ఉన్నారు. పిసాసు 2 సినిమా షూటింగ్‌ ను గత ఏడాదే ముగించాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యిందన్నారు.

ఎట్టకేలకు షూటింగ్‌ పూర్తి చేయడంతో పాటు డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమా లో కీలక పాత్రను విజయ్‌ సేతుపతి చేస్తున్నాడు. ఆయన తాజాగా తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని స్వయంగా పోస్టర్ విడుదల చేసి మరీ క్లారిటీ ఇచ్చారు. ఇతర యూనిట్‌ సభ్యులు కూడా దాదాపుగా డబ్బింగ్‌ పూర్తి చేశారు.

పిశాచి 2 ను మైస్కిన్‌ దర్శకత్వంలో టి మురుగనాధమ్‌ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ స్పీడ్ గా జరుగుతున్న ఈ సినిమా ను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి చిన్న పాత్రలో కనిపించినా కూడా మంచి వెయిట్ ఉన్న పాత్ర అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిలో విజయ్ సేతుపతి పాత్ర ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. విక్రమ్‌ సినిమా తర్వాత ఖచ్చితంగా విజయ్ సేతుపతి స్థాయి పెరుగుతుంది. అందుకే పిసాసు 2 సినిమా లో విజయ్ సేతుపతి ఉండటం వల్ల మంచి బిజినెస్ జరగడంతో పాటు మంచి హైప్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు నమ్ముతున్నారు.