Begin typing your search above and press return to search.

సైరా: అవుకురాజు ఓబయ్యలు కలిసి..

By:  Tupaki Desk   |   11 Oct 2018 5:06 PM GMT
సైరా: అవుకురాజు ఓబయ్యలు కలిసి..
X
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. కీలకమైన యాక్షన్ సీన్స్ అక్కడ చిత్రీకరిస్తున్నారని ఇప్పటికే మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే 'సైరా' టీమ్ అమితాబ్ బచ్చన్ జన్మదినం సందర్భంగా 'సైరా' లో అయన పాత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. యాజ్ యూజువల్ గా అదిరిపోయిందనుకోండి అది వేరే విషయం.

బిగ్ బీ ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ ను డైజెస్ట్ చేసుకునే లోపే మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. అదేంటంటే ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్. మరి ఇది అధికారికంగా విడుదల చేశారా లేదా లీక్ అయిందా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ పోస్టర్ లో విజయ్ సేతుపతి - సుదీప్ లు కలిసి ఉన్నారు. పొడవాటి జుట్టు.. మెలిదిరిగిన మీసాలు.. గడ్డం.. నుదుటిన తిలకం తో ఇద్దరూ వీరుల గెటప్ లో ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఒకే తేడా ఏంటంటే.. విజయ్ సేతుపతి తలపాగా తో ఉండగా.. సుదీప్ కు మాత్రం తలపాగా లేదు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి చిరంజీవి పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడిభుజంగా తమిళుడైన ఓబయ్య పాత్రలో కనిపిస్తాడు. ఇదిలా ఉంటే.. సుదీప్ అవుకు రాజు పాత్రలో కనిపిస్తాడు. సుదీప్ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2 న సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి.. సుదీప్ పాత్రలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.