Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ మరోసారి అదే ఫైట్‌

By:  Tupaki Desk   |   13 July 2019 4:27 AM GMT
సూపర్‌ స్టార్‌ మరోసారి అదే ఫైట్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ హీరో విజయ్‌ ప్రస్తుతం 'బిగిల్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. అట్లీ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై తమిళ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే తెరీ మరియు మెర్షల్‌ చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా సొసైటీ ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే విధంగా ఉంటాయి.

ఇక 'బిగిల్‌' విషయానికి వస్తే ఇది ఫుట్‌ బాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. లేడీ ఫుట్‌ బాల్‌ జట్టు కోచ్‌ గా విజయ్‌ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మెసేజ్‌ లు ఏమీ ఉండవు కేవలం ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మాత్రమే అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా కొన్ని సీన్స్‌ క్రీడా రంగంలో ఉన్న రాజకీయం మరియు అవినీతిని గురించి చర్చించబోతున్నారు. సమాజంలో పేరుకు పోయిన అవినీతిపై హీరో ఎలా ఫైట్‌ చేశాడనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట.

నయనతార హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఒక భారీ ఫుట్‌ బాల్‌ స్టేడియంను ఏర్పాటు చేసి అందులోనే ఎక్కువ శాతం చిత్రీకరణను అట్లీ కుమార్‌ చేశాడు. ఇక ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అట్లీ విజయ్‌ ల కాంబోలో రాబోతున్న ఈ చిత్రం హ్యాట్రిక్‌ ను సొంతం చేసుకుంటుందా చూడాలి.