Begin typing your search above and press return to search.
గర్ల్ ఫ్రెండ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన 'రౌడీ'...!
By: Tupaki Desk | 2 May 2020 10:09 PM IST'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ. గతంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'నువ్విలా' సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ పోషించాడు. మొదటి సినిమానే మంచి విజయాన్ని సాధించడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న మన దేవరకొండకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మొహం మీద చెప్పేసే అతని ఆటిట్యూడ్ అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. లాక్ డౌన్ టైంలో ఇంట్లోనే ఉంటున్న విజయ్ దేవరకొండ అనేక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆకలితో పస్తులుండే వారి కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలతో కాలం గడుపుతున్న విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఇంగ్లీష్ టెలివిజన్ ఛానెల్ తో తన భావాలను పంచుకొన్నారు.
ఈ నేపథ్యంలో అమ్మాయిల విషయంలో తను కోరుకునే కొన్ని క్వాలిటీస్ వివరిస్తూ.. దయాగుణం కలిగి ఉండాలి.. సంతోషంగా లైఫ్ ను ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉండాలి.. ఎప్పుడూ ఎదుటివారిని సంతోష పెట్టేలా ఉండాలి.. లాక్ డౌన్ లో ఉంటే ఎలాంటి ప్రస్టేషన్ రాకుండా చూసుకొనే అమ్మాయి కావాలి.. ఆమెతో ఉంటే జీవితం మొత్తం హాలీడేలా ఉండాలనిపించాలి అని చెప్పుకొచ్చాడట. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాను అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఇందుకు ప్రశ్నగా 'అలాంటి అమ్మాయిని మీరు మీ జీవితంలో ఎప్పుడైన కలిసారా' అంటే 'అవుననే' సమాధానం విజయ్ దగ్గర నుండి వచ్చింది. దీంతో విజయ్ సమాధానాన్ని బట్టి చూస్తుంటే ఇతను ఎవరితోనో రిలేషన్‌షిప్ లో ఉండే ఉంటాడని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక పెళ్ళి గురించి మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను.. ప్రస్తుతం జీవితంలో స్థిరపడాలని నా తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ఆ దిశలో అడుగులు వేస్తున్నానని విజయ్ స్పష్టం చేశారు. అయితే విజయ్ దేవరకొండకి గతంలో రష్మిక తో ఎఫైర్ ఉన్నట్లు.. ఒక ఫారిన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఎప్పుడూ విజయ్ స్పందించలేదు. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం 'ఫైటర్' అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కరణ్ జోహార్ - ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఫైటర్' ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు.