Begin typing your search above and press return to search.

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్.. చేయను అనేశాడు

By:  Tupaki Desk   |   1 Aug 2016 1:30 PM GMT
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్.. చేయను అనేశాడు
X
‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి.. ప్రభాస్ ను ఏడాది పాటు డేట్లు అడిగితే.. ఏడాది ఎక్కడ సరిపోతుంది.. ఛాన్సే లేదు. రెండేళ్లు తీసుకోమని చెప్పాడట. రాజమౌళి అంత భరోసా ఇచ్చాడు కాబట్టి ప్రభాస్ అంతగా సహకరించాడు. ప్రభాస్ అంత సపోర్ట్ చేశాడు కాబట్టే రాజమౌళి అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించగలిగాడు. రాజమౌళి లాగా అందరూ అంత భరోసా ఇవ్వలేరు.. ప్రభాస్ లాగా అందరూ అంత పెద్ద మనసుతో ఉండరు. ఇందుకు తమిళ దర్శకుడు సుందర్ కు ఎదురైన అనుభవమే నిదర్శనం. బాహుబలి కంటే మిన్నగా.. ‘రోబో’ కన్నా ఎక్కువ బడ్జెట్లో ఓ భారీ చిత్రం తెరకెక్కించడానికి సుందర్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుందర్ చెబుతున్న దాని ప్రకారం ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే సినిమా ఇదే.

ఐతే ఈ చిత్రం కోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదిస్తే నో అన్నట్లు వార్తలొచ్చాయి. అందులో వాస్తవమెంతో కానీ.. లేటెస్టుగా విజయ్ ను సుందర్ అడిగి కాదనిపించుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సుందరే వెల్లడించాడు. ఈ భారీ చిత్రం కోసం ఏడాది పాటు విజయ్ బల్క్ డేట్స్ అడిగానని.. అతను అంగీకరించలేదని సుందర్ వెల్లడించాడు. ఆల్రెడీ ‘బాహుబలి’కి పోటీగా ‘పులి’ అనే జానపద చిత్రం చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు విజయ్. మళ్లీ ఇలాంటి భారీ సినిమాల జోలికి వెళ్లాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు విజయ్. రాజమౌళి అయితే అప్పటికే మగధీర.. ఈగ లాంటి విజువల్ వండర్స్ ఆవిష్కరించడంతో ‘బాహుబలి’ విషయంలో అందరికీ భరోసా కలిగింది. సుందర్ కు ఇలాంటి భారీ సినిమాలు తీసిన అనుభవం లేదు. మరి ఏ స్టార్ హీరో మాత్రం ఏడాది డేట్లు ఇవ్వడానికి ముందుకొస్తాడు చెప్పండి?