Begin typing your search above and press return to search.
నేలపై మోకరిల్లి నటుడి క్షమాపణ వెనక సీక్రెట్
By: Tupaki Desk | 14 Dec 2020 12:59 PM ISTకన్నడ లెజెండరీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ కు వ్యతిరేకంగా క్యారెక్టర్ నటుడు విజయ్ రంగరాజు చేసిన వ్యాఖ్యలు దివంగత నటుడి అభిమానుల్లో అగ్గి రాజేసిన సంగతి తెలిసినదే. మహిళా నటీమణుల వద్ద విష్ణువర్ధన్ ప్రవర్తన ఏమంత సరిగా ఉండేది కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ పరిశ్రమకు చెందిన టెలివిజన్ నటులు.. సినీ నటుల్లో తీవ్ర నిరసనకు కారణమైంది. పునీత్ రాజ్ కుమార్.. కిచ్చా సుదీప్.. ఉపేంద్ర సహా పలువురు తనను క్షమాపణ చెప్పాల్సిందిగా సీరియస్ అవ్వడంతో అది జాతీయ స్థాయిలో డిబేట్ కి తెర తీసింది. దీంతో పరిశ్రమ యావత్తూ రంగరాజు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరింది.
చేసిన తప్పును గ్రహించిన సదరు నటుడు అనంతరం క్షమాపణలు చెప్పారు. స్పృహలేని తలబిరుసు వ్యాఖ్యపై కోపంగా ఉన్న విష్ణువర్ధన్ అభిమానులకు మోకాళ్లపై నిలికి తప్పియిపోయింది! అంటూ విలపిస్తూ క్షమాపణలు చెప్పిన రంగరాజు వీడియో అంతర్జాలంలో వైరల్ అయ్యింది.
దాదాపు మూడు నిమిషాల నిడివి గల వీడియోలో నటుడు విజయ రంగరాజు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్ల పర్యంతం అవుతూ క్షమాపణ కోరారు. ``కర్ణాటక ప్రజలను క్షమాపణ కోరుతున్నా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. మహమ్మారి కారణంగా నేను మాస్క్ ధరించాను. నా ముఖం మీకు చూపించడం ఇష్టం లేదు. నేను పాపం చేశాను`` అని విజయ రంగరాజు విలపించారు.
తన ఆర్థిక వృత్తిపరమైన పోరాటంలో వైఫల్యమే నిరాశకు కారణమని చెప్పారు. ``దయచేసి నన్ను విష్ణు వర్ధన్ అభిమానులను క్షమించండి.. నా మాటల వల్ల దివంగత నటుడి భార్య భారతి విష్ణువర్ధన్ ను కూడా క్షమాపణలు కోరుతున్నాను. నన్ను నిజంగా క్షమించండి. సుదీప్ సార్.. పునీత్ రాజ్ కుమార్ .. ఉపేంద్ర సర్ లకు నా హృదయపూర్వక క్షమాపణలు`` అంటూ ఆవేదనను వ్యక్తపరిచారు. సదరు నటుడు తన కాళ్ళ మీద పడి ఏడుస్తూ వీడియోను ముగించాడు. అయితే ఆర్థిక సమస్యలు అవకాశాలు లేకపోవడం వల్లనే రంగరాజు ఈ తప్పును చేశానని అంగీకరించినందున కన్నడ పరిశ్రమ తిరిగి అతడికి అవకాశాలిచ్చి ఆదుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.