Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ పాన్‌ ఇండియా మూవీ ట్రయల్స్‌

By:  Tupaki Desk   |   27 Nov 2020 12:30 AM GMT
సూపర్‌ స్టార్‌ పాన్‌ ఇండియా మూవీ ట్రయల్స్‌
X
తమిళ సూపర్ స్టార్ విజయ్‌ నటించిన ప్రతి సినిమా కూడా ఈమద్య కాలంలో మినిమం వంద కోట్లు వసూళ్లు చేస్తూ ఉంది. సౌత్‌ లో అత్యధిక క్రేజ్‌ ఉన్న హీరోల్లో విజయ్‌ ఒక్కడు అనడంలో సందేహం లేదు. అయితే ఈయనకు పాన్‌ ఇండియా క్రేజ్‌ మాత్రం లేదు. కనీసం తెలుగులో కూడా ఈయన సినిమాలు ఇప్పటి వరకు సూపర్‌ హిట్‌ అయిన దాఖలాలు లేవు. సూర్య.. కార్తీ సినిమాల రేంజ్‌ లో కూడా ఈయన సినిమాలు ఆడలేదు. ఈయన సినిమాలు కేవలం తమిళనాడు వరకే పరిమితం అన్న విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలను బ్రేక్‌ చేసేందుకు విజయ్‌ పాన్‌ ఇండియా ట్రయల్స్‌ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది.

మాస్టర్‌ సినిమాను పూర్తి చేసిన విజయ్‌ తదుపరి సినిమాను నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ త్వరలో ప్రారంభం కాబోతుంది. తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్‌ నుండి పలువురు నటీ నటులను బాలీవుడ్‌ నుండి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌ నటీ నటులు ఉండటం వల్ల ఉత్తరాదిన సినిమాకు మంచి మార్కెట్‌ అవ్వడం ఖాయం. ఇదే సమయంలో యూనివర్శిల్‌ అప్పీల్‌ ఉన్న కథను తీసుకోవడంతో పాటు తమిళ ఫ్లేవర్‌ మరీ ఎక్కువ అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. దీంతో ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ విజయ్‌ పాన్‌ ఇండియా ట్రయల్స్‌ వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.