Begin typing your search above and press return to search.

చందమామ.. ఎక్కడా తగ్గడం లేదమ్మా

By:  Tupaki Desk   |   17 Dec 2016 11:16 AM IST
చందమామ.. ఎక్కడా తగ్గడం లేదమ్మా
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. అమ్మడి కెరీర్ ఆఖరి స్టేజ్ కి వచ్చేసిందని అనుకుంటున్న టైమ్ లో వరుస ఆఫర్స్ తో కుమ్మేసింది. వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేస్తూ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150లో కూడా హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు కాజల్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్స్ అనిపించుకునే రేంజ్ ఉన్న భామలకు కొరత.. సౌత్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

అందుకే అవకాశాలు అడుగంటాయని అనుకున్న సమయంలో కూడా.. కాజల్ కు కుప్పలు తెప్పలుగా ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్ట్స్ మూవీలో కాజల్ నే తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తన 60వ చిత్రంగా భైరవ ను రిలీజ్ కి రెడీ చేస్తున్న విజయ్.. 61వ మూవీగా అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేశారట. గతంలో ఇళయదళపతితో చందమామ రెండు సినిమాల చేసింది. తుపాకి.. జిల్లా చిత్రాలతో ఇద్దరూ కలిసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఇప్పుడు మూడోసారి విజయ్ తో ఛాన్స్ కాజల్ కి వచ్చిందట.

విజయ్ తో మూడో సినిమా చేస్తున్న మొదటి హీరోయిన్ గా కాజల్ రికార్డ్ సృష్టించబోతోంది. విజయ్-అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తెరి సూపర్ హిట్ కావడంతో.. తాజా ప్రాజెక్టుపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అసలీ ప్రాజెక్టుకు నయనతారను అనుకున్నా.. ఆమె 4 కోట్లు కోట్లు డిమాండ్ చేయడంతో అవకాశం కాజల్ అగర్వాల్ దగ్గరకు చేరిందని టాక్. ఇక ఈ మూవీలో మరో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ భామను ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/