Begin typing your search above and press return to search.

దీపావళికి రానున్న 'మాస్టర్'...?

By:  Tupaki Desk   |   16 May 2020 4:30 PM GMT
దీపావళికి రానున్న మాస్టర్...?
X
దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో తమిళ నటుడు 'ఇళయ దళపతి' విజయ్ ఒకరు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ కూడా ఉంటాడని చెప్పొచ్చు. 'తుపాకి' 'సర్కార్' 'పోలీసోడు' 'విజిల్' మరియు 'అదిరింది' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు విజయ్ తన కెరీర్లో 64వ చిత్రంగా 'మాస్టర్' అనే సినిమా చేసాడు. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన 'ఖైదీ' సినిమా తెలుగులో కూడా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్‌ గా నటించారు. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఆంటోనీ, శాంతను కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అన్నీ బాగుండుంటే ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ సూపర్‌ స్టార్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ క్రియేషన్స్ వారు రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోదంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నిర్మాతలు దీనిని ఖండించారు. 'మాస్టర్' సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదని.. కరోనా ప్రభావం తగ్గేదాకా వెయిట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టేసారు.

ఐతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోందో అంటూ విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్టుగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాని దీపావళి ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దీనికి సంభందించిన ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ ఇదే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇద్దరు తమిళ నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'మాస్టర్' పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 'బిగిల్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తాడేమో చూడాలి.