Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ మూవీ పోస్టర్‌ పై క్లారిటీ

By:  Tupaki Desk   |   25 Aug 2020 12:02 PM IST
సూపర్‌ స్టార్‌ మూవీ పోస్టర్‌ పై క్లారిటీ
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన 'మాస్టర్‌' చిత్రం విడుదలకు సంబంధించిన పోస్టర్‌ గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల చేయబోతన్నట్లుగా అది కూడా నవంబర్‌ 14న రానున్నట్లుగా అందులో పేర్కొని ఉంది. దాంతో అంతా కూడా అది నిజమై అనుకున్నారు. విజయ్ సినిమా డైరెక్ట్‌ ఓటీటీ విడుదల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ పోస్టర్‌ నిజం కాదంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటి వరకు సినిమా విడుదలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదంటూ పేర్కొన్నారు. తమిళ స్టార్‌ సూర్య సినిమా ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయిన కారణంగా విజయ్‌ 'మాస్టర్‌' సినిమాను కూడా ఓటీటీ రిలీజ్‌ కు తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారని వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే విజయ్‌ మాస్టర్‌ సినిమా విడుదల తేదీతో కూడిన ఫేక్‌ పోస్టర్‌ ను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

విజయ్‌ వరుసగా వందల కోట్ల వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ విడుదల చేయడం వల్ల నష్ట తప్ప లాభం ఉండదని మరో మూడు నాలుగు నెలల తర్వాత అయినా మాస్టర్‌ ను విడుదల చేసినా పర్వాలేదు అంటూ మరికొందరు అంటున్నారు. మొత్తానికి మాస్టర్‌ సినిమా విడుదల విషయమై తమిళ సినీ పరిశ్రమతో పాటు పూర్తి సౌత్‌ ఇండియా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.