Begin typing your search above and press return to search.

తాను మ‌ర‌ణిస్తూ.. మ‌రొక‌రి జీవితాన్నివెలిగించిన న‌టుడు విజ‌య్

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:00 PM IST
తాను మ‌ర‌ణిస్తూ.. మ‌రొక‌రి జీవితాన్నివెలిగించిన న‌టుడు విజ‌య్
X
ప్ర‌ముఖ క‌న్న‌డ‌ న‌టుడు సంచారి విజ‌య్ రోడ్డు ప్ర‌మాదానికి గురై, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. మ‌ర‌ణం త‌ర్వాత కూడా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డుతున్న తీరు చూసి సినీ ప్ర‌ముఖులు, అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గుర‌వుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన‌ విజ‌య్ అవ‌య‌వాల‌ను దానం చేయ‌డానికి కుటుంబ స‌భ్యులు అంగీక‌రించార‌ని స‌మాచారం.

ఈ నెల 12న స్నేహితుడితో క‌లిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌మ‌దానికి గుర్యాడు విజ‌య్‌. ఈ యాక్సిడెంట్ లో త‌ల‌కు బ‌ల‌మైన గాయాల‌య్యాయి. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించగా.. ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు నిర్ధారించారు. బ్రెయిన్ లో ర‌క్తం గ‌డ్డ క‌ట్టింద‌ని చెప్పిన డాక్ట‌ర్లు.. బ్రెయిన్ డెడ్ అయిన‌ట్టు అనుమానం వ్య‌క్తంచేశారు.

అయిన‌ప్ప‌టికీ.. చికిత్స కొన‌సాగించారు. కానీ.. వాళ్లు సందేహించిన‌ట్టుగానే విజ‌య్ బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స‌కు స్పందించ‌క‌పోవ‌డంతో.. ఈ విష‌యాన్ని అధికారికంగా కుటుంబ స‌భ్యులకు తెలిపారు. అత‌ను బ‌త‌క‌డం అసాధ్య‌మ‌ని చెప్పారు. త‌మ నుంచి విజ‌య్ దూర‌మ‌వుతున్నాడ‌న్న బాధ‌ను అనుభ‌విస్తూనే.. అవ‌య‌వ దానానికి అంగీక‌రించార‌ట కుటుంబ స‌భ్యులు. ఈ మేర‌కు అత‌ని సోద‌రుడు సిద్దేష్ ప‌త్రాల‌పై సంత‌కం చేసిన‌ట్టు తెలుస్తోంది.

విజ‌య్ మృతిప‌ట్ల క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. హీరో సుదీప్ స్పందిస్తూ... విజ‌య్ మ‌ర‌ణించ‌డని న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని, లాక్ డౌన్ ముందు అత‌న్ని రెండుసార్లు క‌లిసిన‌ట్టు గుర్తు చేసుకున్నారు. విజ‌య్ త‌రువాతి సినిమాపై అంద‌రూ సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్న సుదీప్‌.. కుటుంబ స‌భ్యులు సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు.

శాండ‌ల్ వుడ్ లో త‌న‌దైన ముద్ర‌వేశాడు విజ‌య్‌. ‘నాను అవనల్ల.. అవలు’ అనే చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటించి అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ చిత్రానికిగానూ జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో ఎంతో పాపుల‌ర్ అయ్యాడు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో భవిష్య‌త్ ఉన్న సంచారి విజ‌య్‌.. అర్ధంత‌రంగా త‌నువు చాలించ‌డం అంద‌రినీ క‌లచివేస్తోంది.