Begin typing your search above and press return to search.

మరీ అంతా ఇమిటేషనా విజయ్?

By:  Tupaki Desk   |   7 Nov 2018 6:13 PM IST
మరీ అంతా ఇమిటేషనా విజయ్?
X
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం 'సర్కార్' నిన్నే రిలీజ్ అయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మురుగదాస్ మరోసారి నిరాశపరిచాడని అంటున్నారు. ఇవన్నీ పక్కనబెడితే విజయ్ పవన్ కళ్యాణ్ ను కాపీ కొట్టిన విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా సాగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ లో "ప్రశ్నిస్తాను.. ప్రశ్నించడానికి వచ్చాను.. అధికారంలో ఉండేవారిని ప్రశ్నించకుండా వదిలే సమస్యే లేదు" అని విజయ్ అన్నాడు.

విజయ్ త్వరలో పార్టీ పెడతాడని అందుకే ఈ 'ప్రశ్నించడం' అని సెటైర్లు పడుతున్నాయి. ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' లో 'అహ్.. అహ్.. ఆహ్' అంటూ అమ్మాయిలను ఇమిటేట్ చేస్తా హంగామా చేస్తాడు కదా.. ఆ సీన్లో పవన్ యాక్టింగ్ ఓవర్ అయిందని అప్పట్లోనే కొంతమంది ఓపెన్ గా అన్నారు. ఇప్పుడు ఈ తమిళ స్టార్ హీరో అదే 'అహ్.. అహ్.. ఆహ్' లతో పవన్ ను ఇమిటేట్ చెయ్యడం అందరినీ విస్తుపోయేలా చేసింది.

జస్ట్ అహ్.. అహ్.. ఆహ్ లు మాత్రమే కాదు.. పవన్ బాడీ లాంగ్వేజ్.. చేతులు ఊపే తీరు అన్నీ మక్కికి మక్కి దించేశాడు విజయ్. ఇక విజయ్ యాంటి ఫ్యాన్స్ ఈ ఇమిటేషన్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. హమ్మయ్య.. ఒకటి మాత్రం సంతోషం.. పవన్ ను మన తెలుగు హీరోలు మాత్రమే కాదు తమిళ స్టార్ హీరోలు కూడా కాపీ కొడుతున్నారంటే మన తెలుగు వాళ్ళకు గర్వ కారణమే కదా.