Begin typing your search above and press return to search.

'దీపావళి' యాక్షన్ మోడ్లో విజయ్.. నిరాశలో ఫ్యాన్స్..!

By:  Tupaki Desk   |   25 Oct 2022 10:32 AM GMT
దీపావళి యాక్షన్ మోడ్లో విజయ్.. నిరాశలో ఫ్యాన్స్..!
X
తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో 'వరిసు(Varisu)' తెరకెక్కుతోంది. విజయ్ తన కెరీర్ లో ఇప్పటికే 65 సినిమాలు చేసుకోగా.. 66వ సినిమాగా 'వరిసు' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ భాషలో తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో 'వారసుడు'గా డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు.

విజయ్ గత చిత్రం 'బీస్ట్' ఎన్నో అంచనాల మధ్య రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్లాప్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'వరిసు' మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

'Varisu' మూవీ షూటింగ్ గత ఏప్రిల్ నెలలో ప్రారంభమైంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసుకుంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ తాజాగా విడుదలైంది.

విజయ్ యాక్షన్ మోడ్లోలో ఉన్న పోస్టర్ ను దిల్ రాజు తన ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఎప్పటిలాగే విజయ్ చాలా స్టైలిష్ లుక్కులో కన్పించాడు. చేతిలో సుత్తి పట్టుకొని ఓ పది మందికి పైగా రౌడీలను బాది పడేశాడు. ''ది బాస్ రిటర్న్.. హ్యపీ దీపావళి.. వరల్డ్ వైడ్ పొంగల్(సంక్రాంతి)కి కలుద్దాం..'' అంటూ పోస్టర్ కన్పించింది.

తమిళ ఫ్యాన్స్ మాత్రం 'Varisu' మూవీ నుంచి ఎక్కువగా ఆశించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో లేదంటే టీజర్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తే దిల్ రాజు కేవలం ఓ పోస్టర్ తో సరిపెట్టాడు. ఈ మూవీ ప్రారంభమైనప్పటికీ నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్రేజ్ అప్డేట్ రాలేదు.

దీపావళి రోజు సైతం కేవలం పోస్టర్ తో సరిపెట్టడంతో ఫ్యాన్స్ దిల్ రాజుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమిళ తంబీల ఆగ్రహాన్ని చవిచూస్తున్న దిల్ రాజు వారిని ఎప్పుడు సంతృప్తి పరుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ మూవీలో విజయ్ కి జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ సంగీత, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.