Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ తో కాఫీకి జంట‌గా హాజ‌రైన రౌడీబోయ్!

By:  Tupaki Desk   |   30 May 2022 10:30 AM GMT
క‌ర‌ణ్ తో కాఫీకి జంట‌గా హాజ‌రైన రౌడీబోయ్!
X
బాలీవుడ్ ఫేమ‌స్ 'కాఫీ విత్ క‌ర‌ణ్' టాక్ షోకి టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ హాజ‌ర‌వుతున్న‌ట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే జ‌రిగిన క‌ర‌ణ్ బ‌ర్త్ డే కి సైతం విజ‌య్ హాజ‌రై విషెస్ తెలియ‌జేసాడు. బాలీవుడ్ సెల‌బ్రిటీల కోసం ఏర్పాటు చేసిన పార్టీలో విజ‌య్ కి కూడా ఆహ్వానం అందండ‌తో పార్టీలో చిందులేసారు.

విజ‌య్ తో పాటు అన‌న్య పాండే..పూరి జ‌గ‌న్నాధ్..చార్మీ కూడా పార్టీలో ఉన్నారు. దీంతో క‌ర‌ణ్‌-విజ‌య్ మ‌ధ్య బాండింగ్ మ‌రింత స్ర్టాంగ్ అయింద‌ని అర్ధ‌మైంది. 'లైగ‌ర్' సినిమా నిర్మాణంలో క‌ర‌ణ్ భాగ‌స్వామ్యం అవ్వ‌డంతో ఇదంతా సాధ్య‌మైంది. ఇప్పుడా సినిమా విశేషాల‌తో పాటు..విజ‌య్ వ్య‌క్తిగ‌త విష‌యాల్ని సైతం కర‌ణ్ టాక్ షో లో షేర్ చేయ‌డానికి రెడీ అయ్యారు.

ఆయ‌న‌తో పాటు హీరోయిన్ అన‌న్యా పాండే కూడా హాజ‌ర‌వుతుంది. ఇద్ద‌రు జంట‌గా క‌ర‌ణ్ టాక్ షోలో మెరుపులు మెరిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ జంట‌పై టాక్ షోకి సంబంధించిన షూట్ ఆదివారం ముంబైలో జ‌రిగింది. దీనిలో భాగంగా అన‌ధికారికంగా టాక్ షో ప్రోమో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది. విజ‌య్ -అన‌న్య పంజాబీ సాంగ్ కి డాన్స్ చేస్తూ క‌నిపిస్తున్నారు.

ఇందులో పంజాబీ స్టెప్పుల‌తో జంట‌ అద‌ర‌గొట్టింది. ఈ పాట కోసం ప్ర‌త్యేకంగా సెట్ డిజైన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. క‌ర‌ణ్ హోస్ట్ గాటాక్ షో షూట్ మొత్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే క‌ర‌ణ్ జోహార్ ఈ విష‌యాన్ని అధికారికంగా రివీల్ చేసే అవ‌కాశం ఉంది. ఈ టాక్ షో జూన్ లో ప్ర‌సారం కానుంద‌ని స‌మాచారం. అయితే టాక్ షోకి-లైగ‌ర్ సినిమాకి చాలా గ్యాప్ క‌నిపిస్తుంది.

'లైగ‌ర్' చిత్రాన్ని ఆగ‌స్ట్ 25న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో టాక్ షో వ‌చ్చే నెల‌లో ప్ర‌సారం చేస్తే లైగ‌ర్ ప‌బ్లిసిటీ వృద్ధా అవుతుంది. టాక్ షో లో ప్ర‌ధానంగా లైగ‌ర్ గురించి హైలైట్ చేసే అవ‌కాశం ఉంది. సినిమా ప‌బ్లిసిటీకి ఇది ఎంతో ముఖ్యం. మ‌రి ఇవ‌న్నీ ఆలోచించి ఆగ‌స్టు వ‌ర‌కూ వెయిట్ చేస్తారా? వ‌చ్చే నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారా? అన్న‌ది చూడాలి.

ఇప్ప‌టికే క‌ర‌ణ్ టాక్ షోకి ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రం 'బాహుబ‌లి' రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌భాస్..అనుష్క‌..రాజ‌మౌళి..రానా హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత 'ఆర్ ఆర్ ఆర్' చిత్ర ప్రమోష‌న్ లో భాగంగా ఎన్టీఆర్..రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నారు. వీళ్ల‌ తో పాటు రాజ‌మౌళి కూడా రెండ‌వ‌సారి హాజ‌రయ్యారు. ఇప్పుడు క‌ర‌ణ్ తో కాఫీ షేర్ చేసుకునే అరుదైన అవ‌కాశం రౌడీబోయ్ కి ద‌క్కింది. మ‌రి ఎలాంటి విశేషాలు షేర్ చేసుకున్నారో చూద్దాం.