Begin typing your search above and press return to search.

విజయ్ 'బీస్ట్‌'.. దిల్ రాజు ముందు పెద్ద టార్గెట్‌

By:  Tupaki Desk   |   11 Nov 2021 8:41 AM GMT
విజయ్ బీస్ట్‌.. దిల్ రాజు ముందు పెద్ద టార్గెట్‌
X
తమిళ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బీస్ట్. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాకు తెలుగు లో మంచి ఆధరణ లభించింది. అందుకే బీస్ట్‌ సినిమాను కూడా తెలుగు లో భారీగా ప్రమోట్‌ చేస్తే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా బాధ్యతను తెలుగు టాప్ నిర్మాత దిల్ రాజుకు విజయ్ అప్పగించాడని వార్తలు వస్తున్నాయి. విజయ్‌ హీరోగా దిల్‌ రాజు బ్యానర్‌ లో ఒక తెలుగు సినిమా రూపొందబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది.

తెలుగులో బీస్ట్ సినిమా ను 20 కోట్ల బిజినెస్ చేసే లక్ష్యంతో ప్రమోషన్స్ చేయాలని.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని మేకర్స్‌ దిల్ రాజు కు సూచించారని సమాచారం అందుతోంది. దిల్ రాజుపై ఉన్న నమ్మకంతో తెలుగు లో ఎంట్రీకి విజయ్ ఆయన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఆయన చేతిలోనే బీస్ట్‌ తెలుగు డబ్బింగ్‌ రైట్స్ ను ఉంచాడనే వార్తలు కూడా మొదలు అయ్యాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బీస్ట్ వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పటికి దిల్‌ రాజు బ్యానర్‌ లో విజయ్ సినిమా మొదలు అవ్వబోతుంది. బీస్ట్ సినిమాను తెలుగు లో భారీగా విడుదల చేయడం ద్వారా ఆ తర్వాత సినిమాకు మంచి మార్కెట్ ఉంటుందనే ఉద్దేశ్యంతో దిల్ రాజు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ప్రస్తుతం సౌత్ నుండి పెద్ద ఎత్తున పాన్ ఇండియా సినిమాలో వస్తున్నాయి.

ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఉత్తరాదిన మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో విజయ్ తెలుగు లో సినిమాను చేయబోతున్నాడు. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేశారు. ఈ సినిమాకు గాను విజయ్ ఏకంగా వంద కోట్ల పారితోషికంను అందుకుంటున్నాడనే పుకార్లు వస్తున్నాయి. 150 కోట్ల రూపాయలతో సినిమా మేకింగ్‌ ఉంటుందని అంటున్నారు. దిల్‌ రాజు ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని మరీ ఈ రేంజ్ లో ఖర్చు చేసేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది. విజయ్ తెలుగు ఎంట్రీ సినిమా కంటే ముందు బీస్ట్ తో టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాడేమో చూడాలి.