Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: పవర్ ప్యాక్డ్ 'బీస్ట్'.. విజయ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్..!

By:  Tupaki Desk   |   5 April 2022 12:19 PM GMT
ట్రైలర్ టాక్: పవర్ ప్యాక్డ్ బీస్ట్.. విజయ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్..!
X
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''బీస్ట్''. 'వరుణ్ డాక్టర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'బీస్ట్' చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ‘అరబిక్ కుత్తు - హలమితి హబీబో’ పాటను వదిలారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు.

హైదరాబాద్ లో రద్దీగా ఉండే ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయించడానికి ప్రభుత్వ అధికారి అయిన డైరెక్టర్ సెల్వరాఘవన్ చర్చలు జరుగుతున్నారు. అయితే ఆ మాల్ లో స్పై ఏజెంట్ వీర రాఘవ (విజయ్) ఉండటం ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించే అంశం.

కాకపోతే వీర రాఘవ తన పై అధికారుల మాట వినకుండా తనకు నచ్చినట్లు చేసుకుని పోయే ఏజెంట్ అని తెలుస్తోంది. హైజాకర్స్ ని విజయ్ ఎలా అంతమొందించాడు? ఈ ఆపరేషన్ ను ఎలా పూర్తి చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? అతని వెనకున్న అసలు కథేంటి? అనేది తెలియాలంటే 'బీస్ట్' సినిమా చూడాల్సిందే.

'బీస్ట్' సినిమాని స్టైలిష్ ఫైట్స్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందినచినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో విజయ్ సరికొత్త లుక్ లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పూజా హెగ్డేకి ఇందులో ప్రాధాన్యత ఇవ్వలేదు. మెరుపు తీగలాగా అలా ఒక్క షాట్ లో కనిపించింది. యోగిబాబుతో పాటుగా 'వరుణ్ డాక్టర్' లో నవ్వించిన గ్యాంగ్ అంతా ఇందులో భాగం అయ్యారు.

సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో.. అలానే ఇప్పుడు 'బీస్ట్' ట్రైలర్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలానే సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస విజువల్స్ మరియు నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ స్టైలిష్ గా ఉంది. ఇందులోని పాటలకు జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆర్. నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం మీద ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూస్తుంటే.. 'బీస్ట్' సినిమా విజయ్ అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుందని అర్థం అవుతుంది.

'మాస్టర్' మూవీతో తెలుగు మార్కెట్ లోనూ మంచి వసూళ్ళు సాధించిన విజయ్ మరియు 'వరుణ్ డాక్టర్' తో ఆకట్టుకున్న నెల్సన్.. 'బీస్ట్' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.