Begin typing your search above and press return to search.

అమ‌లా పాల్.. అస‌లు రంగు ఇదీ అంటూ!

By:  Tupaki Desk   |   18 April 2020 5:30 AM GMT
అమ‌లా పాల్.. అస‌లు రంగు ఇదీ అంటూ!
X

త‌మిళ ద‌ర్శ‌కుడ ఏ.ఎల్ విజ‌య్- న‌టి అమ‌లాపాల్ ప్రేమ వివాహం అటుపై బ్రేక‌ప్ గురించి తెలిసిందే. ప‌ట్టుమ‌ని ఏడాది కూడా కాపురం చేయ‌కుండానే ఇద్ద‌రూ విడిపోయి ఎవ‌రికి కావాల్సిన స్వా‌తంత్రాన్ని వాళ్లు కోరుకున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌లు కార‌ణంగా విడిపోయార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ విష‌యంపై నేరుగా విజ‌య్ గానీ..అమ‌లాపాల్ గానీ స్పందించ‌లేదు. అయితే విజ‌య్ తండ్రి అజ‌గప్ప‌ మాత్రం ఇద్ద‌రూ విడిపోవ‌డానికి అస‌లు కార‌కురాలు అమ‌లా పాల్ మొండిత‌న‌మేన‌ని.. ఇచ్చిన మాట‌ను మీర‌డ‌మేన‌ని ఓ ఇంట‌ర్వూలో వెల్ల‌డించారు. ఇరువురి మ‌తాలు వేరైనా ప్రేమ‌కు మ‌తం లేని కార‌ణంగా ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయ‌ని..ఆ త‌ర్వాతే అమ‌లాపాల్ అస‌లు రంగు బ‌య‌టప‌డింద‌ని పెద్దాయ‌న అన్నారు.

పెళ్లి త‌ర్వాత కోడ‌లు పిల్ల‌ సినిమాలు మానేయ‌ల‌ని విజ‌య్ కుటుంబం కోరుకుంది. అందుకే ఇరు కుటుంబాలు ముందే కండీష‌న్ కూడా పెట్టుకున్నాయ‌ట‌. అందుకు అమ‌ల కూడా ఒప్పుకుంది‌. కానీ పెళ్ల‌యిన త‌ర్వాత త‌మ‌కు తెలియ‌కుండా ఇద్ద‌రు అగ్ర హీరోల చిత్రాల‌కు సంత‌కం చేసింద‌ని..ఈ కార‌ణంగా విజ‌య్ తో విబేధాలు త‌లెత్తిన‌ట్లు తాజాగా విజ‌య్ తండ్రి మ‌రోసారి వెల్ల‌డించారు. అలాగే అమ‌లాపాల్ త‌ల్లిదండ్రులు ఎంతో మంచివార‌ని ఎంతో చెప్పి చూశార‌ని ఆయ‌న‌ అన్నారు. సినిమాలు మానేయాల‌ని అమ‌ల తండ్రి ఎంతో వేడుకున్నారు. అయినా ఆమె తండ్రి మాట‌ను కూడా ప‌క్క‌న‌పెట్టేసింది. త‌న జీవితం..త‌న ఇష్టం అన్న‌ట్లే వ్య‌వ‌రించింది! త‌ప్ప ఇత‌ర మ‌నోభావాల గురించి అస్స‌లు ఆలోచించ‌లేద‌ని తెలిపారు.

దీంతో విజ‌య్ జీవితం ఇబ్బందుల్లో ప‌డింది. భ‌విష్య‌త్ లో అమ‌ల ఇలాంటి యాటిట్యూడ్ ని చూపిస్తే చాలా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతాయ‌ని భావించాం. అన్ని విష‌యాలు ఆలోచించే ఇలాంటి వారికి దూరంగా ఉండాల‌ని విజ‌య్ సైతం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. విజ‌య్ ఆరోగ్యం.. భ‌విష్య‌త్ ని దృష్టిలో పెట్టుకుని విడాకుల అనే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం విజ‌య్ చాలా సంతోషంగా ఉన్నాడ‌ని...సినిమా జీవితం...ఫ్యామిలీ లైఫ్ రెండూ హ్యాపీగా సాగిపోతున్నాయ‌ని...ఇలాంటి ఆడ‌వాళ్ల విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే! అంత మంచిద‌ని ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. అమ‌లా నుంచి విడిపోయాక ద‌ర్శ‌కుడు ఏ.ఎల్.విజ‌య్ ఓ డాక్ట‌ర్ ని పెళ్లాడిన సంగ‌తి విధిత‌మే.