Begin typing your search above and press return to search.

బీజేపీలోకి కోలీవుడ్​ ప్రముఖుల క్యూ..ఆ బడా స్టార్ తండ్రి కూడా కాషాయ పార్టీలోకి

By:  Tupaki Desk   |   13 Oct 2020 12:10 PM GMT
బీజేపీలోకి  కోలీవుడ్​ ప్రముఖుల క్యూ..ఆ బడా స్టార్ తండ్రి కూడా కాషాయ పార్టీలోకి
X
తమిళనాడులో మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్​ ఇప్పటి నుంచే పెరుగుతోంది. కోలీవుడ్​ కు చెందిన ప్రముఖులంతా బీజేపీలోకి వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ సినీనటి, కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి ఖుష్బూ బీజేపీలో చేరగా.. తాజాగా తమిళ దళపతి విజయ్​ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తమిళనాట సంచలనంగా మారింది.అయితే చంద్రశేఖర్ ఈ వార్తలపై స్పందిస్తూ.. ఇప్పట్లో తనకు రాజకీయాల్లో చేరే ఆలోచన కూడా లేనట్లు స్పష్టం చేశారు. అయినా సరే తమిళ వెబ్ సైట్లు మాత్రం చంద్రశేఖర్​ రేపోమాపో బీజేపీలో చేరుతున్నారని వార్తలు రాశాయి.

తమిళనాడులో మొదటి నుంచి ప్రాంతీయ పార్టీలదే హవా. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాతీయ పార్టీలు బలపడలేకపోతున్నాయి. బీజేపీ అక్కడ ప్రస్తుతం వీక్​ గానే ఉంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులను నయానో భయానో తనవైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. గౌతమి, రాధా రవి, కస్తూరి రాజా, గాయత్రి రఘురామ్ వంటి వారితో ఆ పార్టీ అగ్రనేతలు టచ్​లో ఉన్నారట. తమిళనాడులో విజయ్‌ నటిస్తున్న చిత్రాలన్నీ ఏదొక వివాదంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలను టార్గెట్‌ చేస్తున్నట్లు కొన్ని సీన్లు ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ సినిమాలు విడుదలైన ప్రతిసారి ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇక ఆయన మాస్టర్ షూటింగ్‌లో పాల్గొనే సమయంలోనూ విజయ్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. తాజాగా విజయ్​ తండ్రి బీజేపీలో చేరుతారని వార్తలు రావడం చర్చనీయాంశం అయ్యింది.