Begin typing your search above and press return to search.

రికార్డులు బద్దాలే అంటున్న దళపతి ఫ్యాన్స్.. టికెట్లకోసం రచ్చరచ్చ!!

By:  Tupaki Desk   |   11 Jan 2021 12:08 PM GMT
రికార్డులు బద్దాలే అంటున్న దళపతి ఫ్యాన్స్.. టికెట్లకోసం రచ్చరచ్చ!!
X
లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూసేయడంతో జనాలకు ఎంటర్టైన్మెంట్ లేక ఓటిటిలే దిక్కులా మారాయి. ఇళ్లలోనే బోర్ కొట్టి సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసారు. ఇటీవలే తమిళ సినీ ఇండస్ట్రీలో అటు నటులకు, ఇటు అభిమానులకు ఎంజాయ్ చేసే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్ అనుమతి కల్పించింది. అందుకే ఈ సంక్రాంతికి అక్కడ థియేటర్ల వద్ద పోరుకు సిద్ధం అవుతున్నాయి సినిమాలు. ఇళయదళపతి విజయ్ నటించిన 'మాస్టర్' దాదాపు తొమ్మిది నెలలు ఆలస్యంగా రిలీజ్ అవుతుంది. మాస్టర్ సినిమాకు మొదటి నుండి కూడా పాజిటివ్ వైబ్ ఏర్పడిందని చెప్పాలి. అంతేగాక ఫస్ట్ టైం విజయ్ సినిమా తమిళ, తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే మాస్టర్ టీమ్ మొత్తం భారీ ఎత్తున ప్రమోషన్స్ జరుపుతూనే ఉన్నారు.

సంక్రాంతికి మాస్టర్ సినిమాతో పోటీ విషయానికి వస్తే.. కోలీవుడ్ రేసులో హీరో శింబు నటించిన 'ఈశ్వరన్' సినిమా కూడా సంక్రాంతికి రెడీ అవుతోంది. ఇక తాజాగా మాస్టర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ముగించుకొని రిలీజ్ కి రెడీ అవ్వడంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. తమిళనాడులో మాస్టర్ సినిమా టికెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. టికెట్ కౌంటర్ల దగ్గర పోగైన జనాలను చూస్తే అర్ధమవుతుంది మాస్టర్ గురించి సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. అది కూడా స్టార్ హీరో సినిమా అంటే ఆ మాత్రం జోరు కనిపిస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఫుల్ అయిపోయాయట. మాస్టర్ పక్కా రికార్డు బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే వరుస ప్రోమోలతో ట్రీట్ ఇస్తూనే మేకర్స్. యంగ్ టాలెంటెడ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడు. చూడాలి మరి మాస్టర్ ఎలా ఆకట్టుకుంటాడో..!!