Begin typing your search above and press return to search.

వరల్డ్ ఫేమస్ లవర్ లో ఏముంటుందో చెప్పేసిన రౌడీ

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:51 AM GMT
వరల్డ్ ఫేమస్ లవర్ లో ఏముంటుందో చెప్పేసిన రౌడీ
X
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ..విజయ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల దినోత్సవం సందర్భం గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా లో నలుగురు ముద్దు గుమ్మలతో రౌడీ జత కట్టటం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన సందర్భంగా.. ఇదే తన చివరి ప్రేమ కథా చిత్రంగా చెప్పుకొచ్చి యూత్ కు నిరాశను మిగిల్చాడు.

టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నా.. లవర్ బాయ్ లుక్ లో రౌడీ కాస్త డిఫరెంట్ అన్నది తెలిసిందే. ఈ తరానికి ప్రతినిధిలా కనిపించే విజయ్.. లవ్ సినిమాలు చేయనంటూ.. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళుతున్నా.. అంటూ తన నిర్ణయం వెనుకున్న అసలు కారణాన్ని చెప్పుకొచ్చాడు.

తన తాజా మూవీకి సంబంధించి కీలకమైన అంశాన్ని ప్రస్తావించాడు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో అన్ని రకాల ప్రేమల్ని చూపించనున్నట్లు చెప్పారు. నలుగురు బ్యూటిఫుల్ విమెన్స్ చాలా బాగా చేశారని.. వారితో కలిసి పని చేయటం తనకు చాలా గర్వంగా ఉన్నట్లు చెప్పారు. అందరూ తమ నటనతో చంపేశారని చెప్పుకొచ్చాడు. తన చివరి ప్రేమకథా చిత్రంలో.. సినిమా మొత్తం పూర్తిగా ప్రేమతో నింపేశామని చెప్పుకొచ్చాడు. తన చివరి ప్రేమ కథ చిత్రమని నిరాశ పర్చిన రౌడీ.. తాజా సినిమా లో మాత్రం మస్తు ప్రేమను చూపించేయటం ద్వారా.. సినిమా ఎలా ఉంటుందన్న విషయాన్ని రివీల్ చేశారని చెప్పక తప్పదు.