Begin typing your search above and press return to search.

తెలుగులో విజయ్ దేవరకొండనే ఫస్టు

By:  Tupaki Desk   |   26 Jun 2018 8:20 AM GMT
తెలుగులో విజయ్ దేవరకొండనే ఫస్టు
X
నువ్విలా - లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - ఎవడే సుబ్రమణ్యం లాంటిమూడు సినిమాల్లో కనిపించినప్పటికి హీరోగా విజయ్ దేవరకొండ మొదటి సినిమా పెళ్లి చూపులు.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో విజయ్ కి మంచిపేరు వచ్చింది. తరువాత విడుదలైన అర్జున్ రెడ్డి అంతకంటే పెద్ద హిట్ అయిపోవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో అతని రేంజి పెరిగిపోయింది.

చేతిలో నాలుగు సినిమాలతో టాలీవుడ్లో బిజీ హీరో అయిపోయిన మన విజయ్ ఇప్పుడు బెంగాలీ పిల్ల మలోబికా బెనర్జీ తో జత కట్టనున్నాడు. ఇందులో విశేషం ఏంటి ఇది సినిమా కోసం కాదు ఒక వీడియో సాంగ్ కోసం. భానుశ్రీ తేజ దర్శకత్వం వహించబోతున్న ఈ వీడియో సాంగ్ లో విజయ్ దేవరకొండ - మలోబికా జంటగా నటిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ తెలుగు - తమిళ్ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. భానుశ్రీ కి ఇంతకు ముందు ఇలాంటి రెండు మూడు వీడియో సాంగ్స్ చేసిన అనుభవం ఉంది.

మలోబికా కూడా ఇలాంటి వీడియో సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయే. కానీ ఇది విజయ్ కు మాత్రం మొదటిసారి. హిందీ లో ఇంతకు ముందు హ్రితిక్ రోషన్ - సోనమ్ కపూర్ - ఇమ్రాన్ హష్మీ లాంటి స్టార్లు వీడియో సాంగ్స్ లో నటించడం జరిగింది. కానీ తెలుగులో ఇలా వీడియో సాంగ్ లో నటించబోతున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ.