Begin typing your search above and press return to search.

టాక్సీవాలా ఒక రోజు ఆలస్యంగా.. ఎందుకు?

By:  Tupaki Desk   |   4 Nov 2018 4:32 AM GMT
టాక్సీవాలా ఒక రోజు ఆలస్యంగా.. ఎందుకు?
X
ఒకే రేంజ్ ఉన్న ఇద్దరు హీరోల సినిమాలు పోటీగా రిలీజ్ అయితే ఇద్దరి సినిమాలకలెక్షన్స్ కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా'.. రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' రెండు మీడియం రేంజ్ సినిమాలు. నవంబర్ 16 న విడుదలకు సిద్దం అవుతున్నాయి. మాస్ మహారాజా కు రౌడీ హీరో కు పోటీ తప్పదు అనుకున్న తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

'టాక్సీవాలా' ను యూవీ క్రియేషన్స్ వారు జీఎ2 పిక్చర్స్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు కలిసి చర్చించుకుని డైరెక్ట్ క్లాష్ లేకుండా ఉండేలా రాజీకొచ్చారట. రెండు సినిమాల రిలీజుల మధ్య ఒకరోజు గ్యాప్ ఉండాలని నిర్ణయించుకున్నారట. వారికి కుదిరన అంగీకారం ప్రకారం 'అమర్ అక్బర్ ఆంటోనీ' యాధావిధిగా నవంబర్ 16 న రిలీజ్ అవుతుందని.. 'టాక్సీవాలా' ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 17 న విడుదల అవుతుందని సమాచారం.

ఈరకంగా చర్చించుకుని అనవసర పోటీని నివారించుకుకోవడం రెండు సినిమాలకు మంచిదే. నిజానికి ఈ రెండు సినిమాలు అక్టోబర్ లోనే డైరెక్ట్ క్లాష్ కు దిగాల్సి ఉండగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' ని నవంబర్ కు వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత 'టాక్సీవాలా' కూడా నవంబర్ కే వచ్చింది. ఇప్పుడు రెండో సారి రెండు సినిమాల మధ్య డైరెక్ట్ పోటీ తప్పింది.