Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ దెబ్బ అందరూ షేక్ అయ్యారట!

By:  Tupaki Desk   |   26 Nov 2018 12:28 PM GMT
రౌడీ స్టార్ దెబ్బ అందరూ షేక్ అయ్యారట!
X
'వీడి చర్యలు ఊహాతీతం వర్మా'.. ఈ డైలాగ్ ఎవరి సినిమాలోనిదో ఎవరిని ఉద్దేశించి ఎవరు అంటారో చెప్పి తెలుగు ప్రేక్షకుల మేథస్సును తక్కువ చేయడం భావ్యంకాదు గానీ సేమ్ డైలాగ్ ఇప్పుడు 'VD చర్యలు ఊహాతీతం వర్మా..' అని ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్నారట. వీడీ అంటే ఎవరో అర్థం అయింది కదా.. రౌడీ స్టార్ విజయ దేవరకొండ.

విజయ్ చేసే పనులు.. స్పీచులు.. ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈమధ్య కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలను తన ఇంటికి పిలిచి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాడు. ఇదులో రాజమౌళి కూతురు.. శోభు యార్లగడ్డ తనయులు.. రవితేజ పిల్లలు.. కీరవాణి డాటర్.. బీవీయస్ రవి కిడ్స్.. ఇలా చాలామంది ఈ పార్టీకి హాజరయ్యారు. ఇక రౌడీ స్టార్ ఈవెంట్ అంటే రౌడీ వేర్ ఉంటుంది కదా. దాదాపుగా అందరూ రౌడీ చొక్కాలతో దర్శనమిచ్చారు. ఆ పిల్లల మొహాల్లో వెలుగు చూస్తేనే ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోటోలు బయటకు వచ్చాయి కదా మరి ఇంకా స్పెషల్ ఏముంది అంటారా?

ఈ కిడ్స్ తో రౌడీ స్టార్ పార్టీ టాలీవుడ్ మొత్తంమీద హాట్ టాపిక్ అయిందట. చాలామంది హీరోలు.. అసలు ఇలాంటి ఐడియాలు VD కి ఎలా వస్తాయని చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పటివరకూ ఎంతోమంది హీరోలు వచ్చారు గానీ ఇలా సెలబ్రిటీల పిల్లలను ఇంటికి పిలిచి ఒక చిన్న మీట్ ఏర్పాటు చేసే ఆలోచన ఇంతవరకూ ఎవరికీ ఎందుకు రాలేదని అనుకుంటున్నారట. చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి కాబట్టే కదా అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్ తో పోలికలు వస్తున్నాయి.. క్రేజ్ కూడా వస్తోంది..!