Begin typing your search above and press return to search.

అలియా నెంబరు అందిందా కామ్రేడ్!

By:  Tupaki Desk   |   12 Oct 2019 1:30 AM GMT
అలియా నెంబరు అందిందా కామ్రేడ్!
X
మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల్లో మనసులో ఏమీ దాచి పెట్టుకోకుండా మాట్లాడే సినీ ప్రముఖులు చాలా తక్కువగా ఉంటారు. ఆ కోవకే చెందుతారు రౌడీ ఇమేజ్ తో యూత్ గుండెల్లో నిలిచిన విజయ్ దేవరకొండ. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఇటీవల మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఏమిటన్న ప్రశ్నకు.. గల్లీబాయ్ అని చెప్పారు. తాను ఆ సినిమా చూసినంతనే అలియాభట్ ను అభినందించాలని అనుకున్నట్లు చెప్పారు. ఆ టైంలో తాను అలియా నెంబరు కోసం కరణ్ జోహార్ కు మెసేజ్ చేశానని చెప్పారు.

ఆ సినిమా చూసిన తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మరి కరణ్ కు మెసేజ్ చేసిన తర్వాత రిప్లై ఏమని వచ్చింది? ఇంతకీ అలియాతో రౌడీ మాట్లాడాడా? ఆమె ఎలా రియాక్ట్ అయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు రౌడీ ఎప్పుడు సమాధానం ఇస్తారో అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక్కడో విషయం చెప్పాలి. తాను సినిమాను చూసినంతనే ఇంప్రెస్ అయి అలియా ఫోన్ నెంబరు కోసం ప్రయత్నించినట్లు చెప్పిన విజయ్ దేవరకొండ.. తనకు ఫోన్ చేసే మీడియా ప్రతినిధుల ఫోన్లకు కూడా ఇటీవల కాలంలో ఆన్సర్ ఇవ్వటం లేదంటున్నారు. ఇలా చేస్తే ఎలా భయ్?