Begin typing your search above and press return to search.

నాకు పెళ్లి చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు...!

By:  Tupaki Desk   |   3 May 2020 7:00 PM IST
నాకు పెళ్లి చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు...!
X
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ హీరోలందరితో విజ‌య్ దేవ‌ర‌కొండ శైలి ప్ర‌త్యేకమనే చెప్పొచ్చు. రీల్ లైఫ్ లోనూ.. రియ‌ల్ లైఫ్‌ లోనూ ఒకే త‌ర‌హాలో మాట్లాడ‌టం.. ఒకే మ్యాన‌రిజ‌మ్‌ ఫాలో అవ్వ‌డం.. అందరిలోనూ డిఫరెంట్ గా కనిపించడం మన రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌లోని స్పెషాలిటీ. ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మొహం మీద చెప్పేసే అతని ఆటిట్యూడ్ అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. అందుకే మన దేవరకొండకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. 'అర్జున్‌ రెడ్డి' సినిమాతో యూత్‌ లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌.. రౌడీగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా మంచి మనసును చాటుకుంటున్నారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ తో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు ఛారిటీ పేరిట తనకు వీలైనంత సాయం అందించడానికి ముందుకొచ్చారు. తాజాగా దేవరకొండ విజయ్‌ ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలో పెళ్లి గురించి ఎదురైన ఓ ప్రశ్నపై విజయ్‌ స్పందిస్తూ.. ఫ్యామిలీ లైఫ్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. ఇంట్లో తనను ఇంకా చిన్న పిల్లాడిలానే చూస్తున్నారని.. ప్రస్తుతం తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందన్నారు. పెళ్లికి ఇంకా సమయం ఉందని.. తను మానసికంగా ఇంకా మెచ్యూరిటీ చెందాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు. ఇంట్లో కూడా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. తనకు కాబోయే బార్య ఎలా ఉండాలో కూడా విజయ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెన్సార్‌ హ్యూమర్‌ తోపాటు దయ గుణం కలిగిన అమ్మాయి అంటే తనకు ఇష్టమని చెప్పారు. తనతో ప్రయాణం బోర్‌ కలిగించకూడదని చెప్పుకొచ్చారట. ఇదిలా ఉండగా విజ‌య్ ప్ర‌స్తుతం 'ఫైట‌ర్' అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కరణ్ జోహార్ - ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఫైటర్' ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు.