Begin typing your search above and press return to search.

జడ్జ్ చేసేందుకు నేనెవరిని?: దేవరకొండ

By:  Tupaki Desk   |   26 Aug 2018 9:13 AM GMT
జడ్జ్ చేసేందుకు నేనెవరిని?: దేవరకొండ
X
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగులో హాట్ షాట్ హీరో. 'గీత గోవిందం' సక్సెస్ తో స్టార్ లీగ్ లో చేరిన విజయ్ ను 'అర్జున్ రెడ్డి' రిలీజ్ అయ్యేంత వరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఇంటెన్స్ యాక్టింగ్ తో ఒకేసారి అందరీ దృష్టిని ఆకర్షించాడు. ఇక దర్శకుడు సందీప్ వంగా ఆ సినిమాను విజువలైజ్ చేసి తెరకెక్కిస్తే
అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసింది మాత్రం విజయ్.

'అర్జున్ రెడ్డి' రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. మరోవైపు ఈ సినిమాను హిందీలో షాహిద్ హీరోగా దర్శకుడు సందీప్ రిమేక్ చేస్తున్నాడు. దీంతో విజయ్ లాంటి ఇంటెన్స్ యాక్టింగ్ షాహిద్ చేయగలడా లేదా అని సోషల్ మీడియా లో చర్చలు సాగుతున్నాయి. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూ లో విజయ్ ను 'అర్జున్ రెడ్డి' పాత్రకు షాహిద్ న్యాయం చేయగలడా అని ప్రశ్నిస్తే "తనను జడ్జ్ చేసేందుకు నేనెవరిని. ఈ విషయం నేను కాదు సందీప్ చెప్పగలడు" అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇక హిందీ సినిమాలు చేసే ఆలోచన ఉందా అని అడిగితే ప్రస్తుతానికి తెలుగు - తమిళ చిత్రాలు మాత్రమే తనకు ముఖ్యమన్నాడు. ఇక మంచి సబ్జెక్టు తనదగ్గరకు వస్తే మాత్రం తప్పకుండా హిందీ సినిమా చేస్తానన్నాడు.