Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో ఆగని విజయ్ హంగామా

By:  Tupaki Desk   |   19 Aug 2018 6:03 AM GMT
ఓవర్సీస్ లో ఆగని విజయ్ హంగామా
X

ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సినిమా విజయం సాధించడం ఒక ఎత్తైతే, ఓవర్సీస్ లో ప్రేక్షకులను మెప్పించడం మరొక ఎత్తు. సరైన కంటెంట్ ఉంటే తప్ప అక్కడ సినిమాలకు ఆదరణ లభించదు. పెద్ద స్టార్ హీరోలకు ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదుగానీ తర్వాత సినిమా కలెక్షన్స్ డౌన్ కాకుండా లాబ్లాల్లోకి రావాలంటే మాత్రం కంటెంట్ తప్పనిసరి. మరి ఇలాంటి జోన్ లో మూడు సార్లు వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం అంటే అది పెద్ద ఫీటే.

అలాంటి చోట విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడో సారి 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి 'గీత గోవిందం' ద్వారా అడుగుపెట్టాడు. ఇప్పటికే 'పెళ్లి చూపులు'($1.23 మిలియన్ ).. 'అర్జున్ రెడ్డి'($1.78 మిలియన్) తో రెండు సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ లో ఉండగా ఈ క్లబ్ లో మూడో సినిమాగా 'గీత గోవిందం' తాజాగా వచ్చి చేరింది. ఈ ఫీట్ సాధించడం ద్వారా ప్రభాస్ - రామ్ చరణ్ లను విజయ్ దేవరకొండ దాటాడు. ఎందుకంటే వారికి చెరో రెండు సినిమాలు మాత్రమే మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. వాళ్ళను దాటి అల్లు అర్జున్ ను మూడు 1 మిలియన్ డాలర్ సినిమాల రికార్డును సమం చేశాడు.

ఇక వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో టాప్ లో ఉన్న హీరోల లిస్టు చూద్దాం. మహేష్ బాబు - 8 - పవన్ కళ్యాణ్ - 5 - ఎన్టీఆర్ - 5 - నాని - 5. విజయ్ జోరు చూస్తుంటే ఓవర్సీస్ లో భారీగానే ఫాలోయింగ్ ఏర్పడినట్టు క్లియర్ గా అర్థం అవుతోంది. మరో వైపు 'గీత గోవిందం' 2 మిలియన్ డాలర్ క్లబ్ లో కి అడుగుపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.