Begin typing your search above and press return to search.
#AVD ఇలాంటి కానుకలు ఎన్నయినా ఇస్తాను మమ్మీ
By: Tupaki Desk | 24 Sept 2021 12:54 PM ISTకెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అసాధారణ స్టార్ డమ్ తో దూసుకుపోతున్న యువహీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేస్తున్నాడు. అతడు ఇటీవలే తన తల్లిదండ్రులు కుటుంబీకులతో కలిసి జూబ్లీహిల్స్ లో స్వగృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.
ఈ లాక్ డౌన్ లోనే అతడు ఇంద్ర భవనాన్ని తలపించే #AVD మల్టీప్లెక్స్ ని నిర్మించాడు. `లవ్ స్టోరి` సినిమాతో ఈ థియేటర్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తన తల్లికి పుట్టినరోజు సందర్భంగా కొత్తగా ప్రారంభించిన మల్టీప్లెక్స్ థియేటర్ ను బహుమతిగా ఇచ్చాడు.
ముద్దుల కొడుకు విజయ్ దేవరకొండ తన తల్లి దేవరకొండ మాధవి పుట్టినరోజు సందర్భంగా ఒక చక్కని నోట్ తో శుభాకాంక్షలు తెలిపారు. అతను కొత్తగా నిర్మించిన మొదటి మల్టీప్లెక్స్ థియేటర్... ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD) ను ఆమెకు పుట్టినరోజు కానుకగా బహుకరించారు. అమ్మ ఆరోగ్యంగా ఉండి.. వర్కవుట్ లు చేస్తే ఆమెకు మరిన్ని జ్ఞాపికల్ని ఇస్తానని దేవరకొండ వాగ్దానం చేశాడు. అది ఎంతో గొప్ప ప్రామిస్ అనడంలో సందేహం లేదు. తన కుమారుని థియేటర్ లో ఎంతో గర్వంగా కనిపిస్తున్న ఆ మాతృమూర్తి మోములో గొప్ప ఆనందం కనిపిస్తోంది. పుత్రోత్సాహం ఆ సుపుత్రుని కనంగ అన్నంత ఆనందం తనలో కనిపిస్తోంది. ఈ ఫోటోతో పాటు.. హ్యాపీ బర్త్ డే ముమ్ములు.. ఇది మీ కోసం!.. అని వెల్లడించాడు.
విజయ్ దేవరకొండ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఒక చిన్న పాత్ర ను పోషించి తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఒక మల్టీప్లెక్స్ సినిమా యజమానిగా ఎదిగిన ఈ ప్రయాణం అభినందనీయం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నాడు. లైగర్ గా ప్రత్యేకమైన పాత్రతో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఇది. అనన్య పాండే ఇందులో కథానాయిక. పూరి జగన్నాధ్ యొక్క పూరి కనెక్ట్స్ తో పాటు ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ తన టీమ్ తో కలిసి ప్రస్తుతం గోవాలో షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్స్ ని ఆకస్మికంగా సందర్శించడం తెలిసిందే. విజయ్- ఛార్మీ -పూరితో కలిసి ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. లైగర్ తెలుగు - హిందీలో ఏకకాలంలో చిత్రీకరించబడింది. ఇతర భాషలలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారు. లైగర్ ని మొదట్లో 9 సెప్టెంబర్ 2021 న రిలీజ్ కానుందని ప్రకటించినా అప్పుడు విడుదల సాధ్యపడలేదు.
లైగర్ లుక్ తో పాటు పాత్ర స్పెషల్
`లైగర్` లో విజయ్ దేవరకొండ మ్యాకో లుక్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడు. అంతేకాదు.. లైగర్ టైటిల్ .. క్రాస్ బ్రీడ్ అన్న ట్యాగ్ కి తగ్గట్టే విజయ్ పాత్రను తెరపై వైవిధ్యంగా ఆవిష్కరిస్తున్నారు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బాక్సింగ్ నేపథ్యాన్ని ఎంచుకుని హీరో పాత్రకు ఒక చిన్న ట్విస్టుని లాజిక్కుని యాడప్ చేసి పూరి ఫుల్ మ్యాజిక్ నే ప్లాన్ చేశారని గుసగుస వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ పాత్రకు తడబాటు సమస్య ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇది ఎలాంటిది అంటే... జై లవకుశలో తారక్ పాత్రలా ఒక డిఫరెంట్ ఆహార్యంతో ఉంటుందని తెలిసింది.