Begin typing your search above and press return to search.

రౌడీ స‌క్సెస్ గుట్టు విప్పేసాడిలా

By:  Tupaki Desk   |   31 Dec 2019 6:42 AM GMT
రౌడీ స‌క్సెస్ గుట్టు విప్పేసాడిలా
X
`అర్జున్ రెడ్డి` సినిమా కు ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రిలాగే ఓ మామూలు హీరో. ఆ సినిమా రిలీజ్ త‌రువాత సీనే మారిపోయింది. ఊహాతీత‌మైన రైజింగ్ హీరో అయిపోయాడు. `మాకే టార్గెట్ లు సెట్ చేస్తున్నాడు.. అవి రీచ్ కావ‌డానికి ప్ర‌తీ ఒక్క‌రూ ప్ర‌య‌త్నించాల్సిందే`` అని ఓ సంద‌ర్భం లో అక్కినేని నాగ‌చైత‌న్య నే రౌడీ గురించి మీడియా ముఖంగా చెప్పాడంటే టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ క్రియేట్ చేసిన బ‌జ్ మిగ‌తా హీరోల‌ని ఏ స్థాయి లో కంగారు పెట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు.

సినిమా సినిమాకు త‌న క్రేజ్ ని.. మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్న ఈ రౌడీ హీరో త‌న స‌క్సెస్ వెన‌క అస‌లు గుట్టు బ‌య‌ట‌పెట్టాడు. ఆ సీక్రెట్ పై ప్ర‌త్యేకంగా ఓ ఫిలాస‌ఫీ ఉంద‌ట‌. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ‌ టీవీ ఛాన‌ల్ `న‌వ న‌క్ష‌త్ర స‌న్మానం పేరుతో ఓ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు చేతుల మీదుగా విజ‌య్ దేవ‌ర‌కొండ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భం గా విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తించాయి.

మ‌నం ఎక్స్‌ట్రార్డిన‌రీ కావాలంటే ఆర్డిన‌రీ జ‌నాలు ఏం చేస్తారో వారికంటే మ‌నం ఎక్స్‌ట్రా చేయాలి. అంద‌రూ 6కు లేస్తే మ‌నం మాత్రం 5 గంట‌ల‌కే నిద్ర లేచి ప‌ని మొద‌లెట్టాలి. ఎదుటి వాడు కిలోమీట‌ర్ ఉరికితే మ‌నం వాడికి మించి ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్ ప‌రుగెత్త‌డానికి సిద్ధంగా వుండాలి. లైఫ్ లో ఇదొక్క‌టే నేను బ్లైండ్ గా ఫాలో అవుతున్న‌ది`` అని త‌నదైన స్టైల్లో సక్సెస్ సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`తో పాటు `ఫైట‌ర్‌` చిత్రాల్లో అత‌డు న‌టిస్తున్నారు.