Begin typing your search above and press return to search.

పెళ్లిచూపులు హీరో.. టీజర్ కబుర్లు

By:  Tupaki Desk   |   5 Feb 2017 4:32 AM GMT
పెళ్లిచూపులు హీరో.. టీజర్ కబుర్లు
X
పెళ్లిచూపులు అంటూ ఒకే మూవీతో క్రేజీ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అంతకు మందు ఎవడే సుబ్రమణ్యంలో కూడా నానితో యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమాలు తెగ రూపొందుతున్నాయి. ఇప్పుడు అర్జున్ రెడ్డి అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ చేస్తున్నాడీ కుర్ర హీరో.

ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ చెప్పడం కోసం.. కేవలం హీరో డైలాగులతో ఓ టీజర్ రిలీజ్ చేశారు. 'జస్ట్ టూ షాట్స్ కోసం మొన్న రిషికేష్ వచ్చాం. నిన్న డెహ్రాడూన్.. ఈ రోజో రేపో ముస్సోరిలో షూట్ చేయబోతున్నాం. ఇక్కడ మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉంది. మేం ఇటలీలో షూట్ చేశాం. మ్యూనిక్ లో షూట్ చేశాం. మాంగళూర్ లోషూట్ చేశాం. హైద్రాబాద్ లో షూట్ చేశాం. ఇన్ని ప్లేస్ లు ఎందుకంటే.. అర్జున్ ఈజ్ ఏ బ్లడీ క్రేజీ ఫిలిం. ఒక వాస్తవగాధ ఆధారంగా అర్జున్ రెడ్డి రూపొందింది' అని చెప్పాడు విజయ్ దేవరకొండ.

'యాక్సెస్ లేదు కానీ.. లేకపోతే చంద్రుడిపై కూడా షూటింగ్ తీద్దామని అనుకున్నాం. తను ఇక్కడ నాతో ఏం చేస్తోందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. నన్ను నడిపిస్తోంది. ప్రేమలోని ఓ మధుర క్షణం మగాడిని నడిపించగలదు. థ్యాంక్యూ బాబూ' అంటూ హీరోయిన్ శాలినికి ఓ చిన్ని ముద్దు ఇచ్చిన విజయ్ దేవరకొండ.. తను నటించిన అర్జున్ రెడ్డి టీజర్ ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుందంటూ సైన్ అవుట్ చెప్పేశాడు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/