Begin typing your search above and press return to search.

రౌడీ గారు.. తమ్ముడు గారు సింప్లీ సూపరు

By:  Tupaki Desk   |   28 Dec 2019 9:41 AM GMT
రౌడీ గారు.. తమ్ముడు గారు సింప్లీ సూపరు
X
ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరో విజయ్ దేవరకొండ. ఇతర హీరోలలాగా సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్ తో కూడా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈమధ్యనే విజయ్ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను 'దొరసాని' సినిమా తో హీరో గా పరిచయం చేశాడు. దీంతో ఇద్దరు సోదరుల కు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.

ఈమధ్య దేవరకొండ సోదరులు ఇద్దరూ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో కనిపించారు. విజయ్ దేవరకొండ తమ్ముడిపై చెయ్యి వేసి.. తన బలం చూపిస్తూ చేతిని పైకెత్తి ఒక సూపర్ పోజిచ్చాడు. రౌడీ బ్రాండ్ దుస్తులు ధరించి ఎప్పటిలాగే స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా ఉన్నాడు. పొడవాటి జుట్టు.. మీసాలు.. తల పై మంకీ క్యాప్ ధరించి రాక్ స్టార్ తరహా లో కనిపిస్తున్నాడు. ఇక తమ్ముడు ఆనంద్ కూడా ఫుల్ స్లీవ్స్ టీ షర్టు.. ట్రాక్ ప్యాంట్.. స్పోర్ట్ షూ ధరించి అన్నకు స్టైల్ విషయంలో పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా ఇలా రౌడీ బ్రదర్స్ ను ఒకే ఫోటోలో చూడడం అభిమానులకు ఒక ట్రీట్ లాంటిదే.

సినిమాల విషయానికి వస్తే విజయ్ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజుకు రెడీ అవుతోంది. ఇక రౌడీగారి తమ్ముడు ఆనంద్ తన రెండవ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.