Begin typing your search above and press return to search.

అభిమానుల కోసం విజయ్ సర్ప్రైజ్

By:  Tupaki Desk   |   23 Dec 2017 10:36 AM IST
అభిమానుల కోసం విజయ్ సర్ప్రైజ్
X
ఈ రోజుల్లో సినీ తారలకు అభిమానులు చాలా ఎక్కువయ్యారనే చెప్పాలి. ఎన్ని సినిమాలు తీసినా సరే ఒక హీరోకి మంచి తనం లేకుంటే అభిమానులు అస్సలు లెక్క చేయరు. అభిమానులు గందరగోళంగా దగ్గరికి వస్తే.. అర్థం చేసుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. జనాల మద్యలోకి వెళ్లాలంటే కొంత మంది స్టార్స్ చాలా భయపడతారు. లేకుంటే కోప్పాడతారు - చేయి కూడా చేసుకుంటారు.

అభిమానులను అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది అర్జున్ రెడ్డి సినిమాతో యువతను ఎంతగానో ఆకట్టుకున్న విజయ్ సాయి దేవరకొండకు కూడా అభిమానులు చాలా ఎక్కువయ్యారనే చెప్పాలి. అయితే అభిమానులు తనకు మంచి విజయాన్ని ఇచ్చారని కనీసం కొంత మందిని అయినా కలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే హైదరాబాద్ లోని ఒక ప్లేస్ కి వెళ్లి యువతని కలుసుకున్నాడు.

మొదటి సారి తన బొమ్మని రోడ్ మీద అందంగా వేశారని వారిని కలిసి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. న్యూ ఇయర్ కి నేను ఇక్కడ ఉండను అంటూ అందుకే వీరిని కలవబోతున్న అని చెప్పి కార్ దిగాడు. అది చూసిన యువత షాక్ అయ్యారు. దగ్గరికి వచ్చి హాగ్ చేసుకున్నారు. అంతే కాకుండా విజయ్ వారికి క్రిస్మస్ స్పెషల్ బహుమతులను కూడా ఇచ్చాడు. సెల్ఫీలు దిగి వారితో పాటు గోల గోల చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి హ్యాపీగా ఉందని ట్వీట్ చేశాడు.