Begin typing your search above and press return to search.

మీరు చూడండి.. నాకు మాత్రం భయం

By:  Tupaki Desk   |   8 Oct 2017 6:13 AM GMT
మీరు చూడండి.. నాకు మాత్రం భయం
X

అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత చాలా మంది విజయ్ దేవరకొండ పేరు అర్జున్ రెడ్డి అనే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే ఆ సినిమా ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సినిమాతో విజయ్ స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అనేలా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ కనిపించాడు.

అది హీరోగా నటించిన నెక్స్ట్ నువ్వే సినిమా ఆడియో లాంచ్ గత రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ముఖ్యంగా హిరో ఆదికి సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నాడు. అలాగే సినిమాకు దర్శకత్వం వహించిన ప్రభాకర్ అన్నకు కూడా మంచి గుర్తింపు రావాలని విజయ్ చెప్పాడు.

ఇక చిత్ర నిర్మాణ సంస్థ వి4 ప్రొడక్షన్ గురించి మాట్లాడుతూ.. సంస్థలో భాగమైన అల్లు అరవింద్ గారు - బన్నీ వాసు వంటి టాప్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మంచి కాన్సెప్ట్ ఉంటే సినిమాను నిర్మించడానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటరు. ఇక సినిమాను చూసి భయపడండి నవ్వండి అని తెలుపుతూ.. 'నాకు మాత్రం దెయ్యాలంటే చాలా భయం. మీరు చూడండి' అంటూ విజయ్ దేవరకొండ వివరించారు.