Begin typing your search above and press return to search.

మన రౌడీస్టార్‌ ఆయనకు ఫుల్ గా నచ్చేసినట్లున్నాడు..!

By:  Tupaki Desk   |   2 Aug 2022 10:35 AM GMT
మన రౌడీస్టార్‌ ఆయనకు ఫుల్ గా నచ్చేసినట్లున్నాడు..!
X
టాలీవుడ్‌ స్టార్‌ విజయ్ దేవరకొండ రాబోయే రోజుల్లో బాలీవుడ్‌ లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

పాన్ ఇండియా సినిమా అయిన లైగర్ సినిమా ను పూరి జగన్నాధ్‌ తెరకెక్కించగా ఆయనతో కలిసి కరణ్‌ జోహార్‌ నిర్మించిన విషయం తెల్సిందే. ఉత్తర భారతంలో లైగర్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

కరణ్‌ జోహార్‌ స్వయంగా లైగర్ సినిమా ను హిందీ లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. అందుకే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కరణ్‌ డిజైన్‌ చేశాడు. అందుకు తగ్గట్లుగా విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్‌ అనన్య పాండేలు మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండతో మరింతగా ట్రావెల్‌ అయ్యేందుకు కరణ్‌ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కరణ్‌ జోహార్‌ ఒక స్టార్‌ తో కనెక్ట్‌ అయితే వారితో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాడని బాలీవుడ్ లో టాక్ ఉంది. లైగర్ సినిమా తో విజయ్ దేవరకొండ మరియు కరణ్‌ జోహార్‌ ల మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అందుకే తెలుగు హీరో అయినా కూడా కరణ్‌ జోహార్‌ వరుసగా తమ సంస్థలో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం అందుతోంది.

గతంలో ఎంతో మంది హీరోలతో వరుసగా సినిమాలను చేసి స్టార్స్ ను చేసిన ఘనత కరణ్‌ జోహార్‌ కి ఉంది. అందుకే కరణ్‌ జోహార్‌ ని స్టార్‌ మేకర్‌ అంటారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఆయన కంపెనీలో పడ్డాడు. ముందు ముందు కూడా వరుసగా మన రౌడీ స్టార్‌ తో కరణ్‌ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు కనుక ఖచ్చితంగా విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ లో స్టార్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ అభిమానులు అంటున్నారు.

విజయ్ దేవరకొండ లైగర్‌ సినిమా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే వెంటనే జనగనమణ కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా పూరి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నుండి వరుసగా బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ లనే విజయ్ దేవరకొండ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమా లో రౌడీ స్టార్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.