Begin typing your search above and press return to search.

'గీత గోవిందం' అడ్వాన్స్ బుకింగ్స్...స్ట‌న్నింగ్!

By:  Tupaki Desk   |   13 Aug 2018 12:02 PM GMT
గీత గోవిందం అడ్వాన్స్ బుకింగ్స్...స్ట‌న్నింగ్!
X
విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక మంద‌నలు జంట‌గా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన `గీత గోవిందం` చిత్రం ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ - `ఇంకేం ఇంకేం కావాలే`, `వాట్ ద లైఫ్`....పాట‌లు చిత్రంపై విప‌రీత‌మైన క్రేజ్ ను పెంచాయి. ఈ సినిమాకు సంబంధించిన రా ఫుటేజ్ లీక‌వ‌డంతో ట్రైల‌ర్ రిలీజ్ కాక‌పోయినా....ఆ పాజిటివ్ బ‌జ్ మాత్రం కొన‌సాగుతోంది. టీజ‌ర్ లో గోవింద్, గీత‌ల మ‌ధ్య రొమాంటిక్ ల‌వ్ స్టోరీ....యూత్ కు బాగా క‌నెక్ట్ అయింది. దానికితోడు విజ‌య్ క్రేజ్ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచింది. ఈ ఇండిపెండెన్స్ డే హాలిడేతో పాటు వీకెండ్ ను టార్గెట్ చేసిన ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు ఓ రేంజ్ లో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కావ‌డంతో ... తొలి రోజు గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈ మ‌ధ్యకాలంలో విప‌రీత‌మైన పాజిటివ్ బ‌జ్ తెచ్చుకున్న సినిమాల్లో `గీత గోవిందం` ఒక‌టి. ఆక‌ట్టుకునే సంగీతం, పాట‌లు, విజ‌య్-ర‌ష్మిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ...ఇవ‌న్నీ ఆ సినిమాపై క్రేజ్ ను మ‌రింత పెంచాయి. ముఖ్యంగా యూత్ ఈ చిత్రం విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ....అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్సే ...అందుకు నిద‌ర్శ‌నం. బుధ‌ - గురు వారాల‌కు...టికెట్స్ అన్నీ అడ్వాన్స్ గానే బుక్క‌య్యాయి. ఇక‌, ఫ్రైడేతో పాటు వీకెండ్ లో ఈ చిత్రం హౌస్ ఫుల్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ ధీమాగా ఉంది. మ‌రోవైపు, యూఎస్ ఏ లోనూ మంగ‌ళ‌వారం నుంచి ప్రీమియ‌ర్ షోలు మొద‌లవుతున్నాయి. ఏది ఏమైనా...గీత గోవిందం...ఫ‌స్ట్ వీక్ లో మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌ని చిత్ర నిర్మాత‌లు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.