Begin typing your search above and press return to search.

ఆ విషయంలో విజయ్ దేవరకొండ తగ్గట్లేదు

By:  Tupaki Desk   |   1 March 2017 3:30 AM GMT
ఆ విషయంలో విజయ్ దేవరకొండ తగ్గట్లేదు
X
ఇప్పటికే అర్జున్ రెడ్డి పోస్టర్ కుర్రకారులో మంచి హీటే పెంచేసింది. హీరోయిన్ తో కలిసి విజయ్ దేవరకొండ చేసిన లిప్ లాక్ కి మంచి స్పందనే వచ్చింది. ఇందులో ఇలాంటివి దాదాపు 14 దాకా లిప్ లాకులున్నాయట. అర్జున్ రెడ్డిలో అన్నేసి లిప్ లాకులుంటే... తాజాగా విడుదలవుతున్న ‘ద్వారక’లో ఎన్ని వున్నాయంటే... ఇందులో కూడా రెండు వున్నాయి అంటున్నాడు విజయ్ దేవరకొండ. దీన్ని బట్టి చూస్తుంటే.. విజయ్ దేవరకొండ లిప్ లాక్ విషయంలో అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది.

ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయ్.. మీడియాతో ముచ్చటించారు. ప్రతి సినిమాలోనూ లిప్ లాకులు చేసేస్తున్నారు.. వాటికోసం ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నారా అని ప్రశ్నిస్తే... ‘అలాంటిదేమీ లేదు... కథను బట్టే అవి వుటున్నాయి. వాటికి.. నా రెమ్యునరేషన్ కు అస్సలు సంబంధం లేదు... సిచ్చుయేషన్ డిమాండ్ చేయడంతో లిప్ లాక్ చేస్తున్నాను తప్ప.. మరే ఉద్దేశం లేదని’ చెప్పాడు.

ఇంకా మాట్లాడుతూ.. ‘ద్వారక’ చిత్రంలో నేను ఓ దొంగ బాబాగా నటిస్తున్నా. అలా దొంగ బాబాగా ఎందుకు మారాను అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. దాన్ని స్క్రీన్ పై చూస్తేనే బాగుంటుంది అన్నారు. మరి ‘పెళ్లి చూపులు’ కంటే ముందు ఈ కథను ఒప్పుకున్నారు కదా.. ఒక వేళ ‘పెళ్లి చూపులు’ తరువాత అయితే ఒప్పుకునే వారా? అని ప్రశ్నిస్తే.. ‘కచ్చితంగా ఒప్పుకునేవాణ్ని. ఎందుకంటే ఇందులో కంటెంట్ బాగుంది. రిలీజ్ అవ్వటం లేట్ అయింది కానీ.. సినిమాలో కంటెంట్ లేక కాదు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.