Begin typing your search above and press return to search.
రౌడీ స్టార్ సరైన మార్గంలోనే వెళ్తున్నాడా..??
By: Tupaki Desk | 31 March 2022 8:00 AM ISTసెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు నేషనల్ వైడ్ తన మార్కెట్ ని విస్తరించుకునే పనిలో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు. అయితే ఈ రెండూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీంతో రౌడీ బాయ్ సరైన మార్గంలోనే వెళ్తున్నాడా? అనే చర్చ నెట్టింట మొదలైంది.
కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ దేవరకొండ.. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీ VD ని క్రేజీ హీరోగా మార్చేసింది.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
దీని తర్వాత వచ్చిన 'గీత గోవిందం' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి విజయ్ మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసింది. అయితే ఇదే క్రమంలో వచ్చిన 'నోటా' 'డియర్ కామ్రేడ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కాస్త స్లో అయిన వీడీ.. ఇప్పుడు 'లైగర్' సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా 'లైగర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇందులో మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
'లైగర్' సినిమా ఇటు వీడీకి అటు పూరీకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ భాగస్వామ్యంతో పూరీ జగన్ & చార్మీ కౌర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని 2022 ఆగస్టు 25న విడుదల చేయనున్నారు.
అయితే 'లైగర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే పూరీ దర్శకత్వంలో విజయ్ ''JGM'' అనే మరో పాన్ ఇండియా మూవీ కమిట్ అవ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే పూరీ జగన్ కాంపౌండ్ అనేది ఒక స్టాక్ మార్కెట్ లాంటిదని ఇండస్ట్రీలో టాక్ వుంది.
పూరీ ఎప్పుడు పైకి లేస్తాడో.. అలాగే అమాంతం ఎప్పుడు క్రిందికి పడిపోతాడో ఎవరూ ఊహించలేరు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూసిన దర్శకుడు.. చివరగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్టు కొట్టాడు. అప్పటి నుంచి 'లైగర్' సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.
అయితే ఉన్నట్టుండి రౌడీ విజయ్ తో 'జనగణమన' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రానికి 'జీజీఎం' అనే టైటిల్ ఖరారు చేసి.. మంగళవారం ముంబైలో లాంఛనంగా మూవీని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా టైటిల్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
'JGM' టైటిల్ లుక్ మరియు దాని చుట్టూ ఉన్న హంగామా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయని.. ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ వచ్చాయి. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ఎప్పటి నుంచో రెడీగా ఉన్న ఈ సినిమా విజయ్ వల్ల కార్యరూపం దాల్చబోతోందని తెలిపారు.
పూరి కనెక్ట్ - శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఛార్మి కౌర్ - వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. షూటింగ్ ప్రారంభం రోజే ఈ చిత్రాన్ని 2023 ఆగస్టు 3న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఇలా వరుసగా రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అవడం కరెక్టో కాదో అనే దానికి రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుంది. కానీ ఇవి తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాయని వీడీ నమ్ముతున్నారు.
ఇందులో నటిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని చెబుతున్నాడు. మరి రౌడీ స్టార్ కు పూరీ జగన్ చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడతాయో చూడాలి.