Begin typing your search above and press return to search.

రౌడీ ని మ‌రో మాస్ రాజాని చేస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:13 AM GMT
రౌడీ ని మ‌రో మాస్ రాజాని చేస్తాడ‌ట‌
X
యూత్ లో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజు గురించి తెలిసిందే. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లోనూ దేవ‌ర‌కొండ పేరు మార్మోగుతోంది. అర్జున్ రెడ్డి హీరోగా అత‌డి కంటూ తెలుగు- త‌మిళ ప‌రిశ్ర‌మ‌లు స‌హా ఉత్త‌రాదినా ఓ ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీ ఉంది. ఈ క్రేజును క్యాష్ చేసుకునేందుకు దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అందుకోసం ముంబై లో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. పూరి-ఛార్మి బృందాన్ని క‌ర‌ణ్ జోహార్ తో క‌లిపి ఫైట‌ర్ ని పాన్ ఇండియా కేట‌గిరీ లో తెర‌కెక్కించేలా స‌న్నాహాలు చేస్తున్నాడు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేయ‌డం తో ఫైట‌ర్ మ‌రో లెవ‌ల్ కి వెళుతోంది.

పూరి త‌ర్వాత దేవ‌ర‌కొండ తో ప‌ని చేసే ద‌ర్శ‌కుడెవ‌రు? అన్న‌దానికి ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన క్లారిటీ లేదు. అత‌డు ఓకే అంటే ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. ఈ క్యూలో ప్ర‌స్తుతం వెంకీమామ దర్శ‌కుడు బాబి పేరు చేరింది. ఈ శుక్ర‌వారం వెంకీమామ రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీబిజీగా ఉన్న బాబీ ఓ ఇంట‌ర్వ్యూ లో ఆస‌క్తిక‌ర సంగతుల్ని రివీల్ చేశాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ లో మాస్ ఎన‌ర్జీకి త‌గ్గ స్క్రిప్టు ను రెడీ చేస్తున్నాన‌ని బాబి అన్నారు. త‌న‌వ‌ద్ద ఒక మాస్ హీరోకి సూట‌య్యే స్క్రిప్టు ఉంది. అయితే అది విజ‌య్ స్టామినా కు.. ఎన‌ర్జీ లెవ‌ల్ కి త‌గ్గ‌ట్టు గా తీర్చిదిద్దాల్సి ఉంద‌ని అన్నారు. అర్జున్ రెడ్డి లో మాస్ ల‌వ‌ర్ బోయ్ గా న‌టించిన దేవ‌ర‌కొండ నుంచి మాస్ మ‌హారాజా రేంజు మాసిజాన్ని బ‌య‌టికి తీసే ఆలోచ‌న‌లో బాబీ ఉన్నాడ‌ని అత‌డి స్టేట్ మెంట్ చెబుతోంది. ర‌వితేజ‌- ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్ల తో మాస్ సినిమాలు చేసిన బాబీ దేవ‌ర‌కొండ‌ ను కూడా మాస్ యాంగిల్ లో చూపించేందుకు స‌న్నాహాలు చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే విజ‌య్ ని స్క్రిప్టుతో ఒప్పించ‌డం అంత సులువేం కాదు. బాబీ ఆ విష‌యంలో స‌క్సెస‌వ్వాలంటే గురువు కోన వెంక‌ట్ ని దించాలేమో!!