Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి 14 ను లాక్ చేసుకున్న రౌడీగారు!

By:  Tupaki Desk   |   24 Nov 2019 5:25 AM GMT
ఫిబ్రవరి 14 ను లాక్ చేసుకున్న రౌడీగారు!
X
యువ హీరో విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది కానీ మధ్యలో విజయ్ 'డియర్ కామ్రేడ్' పై దృష్టి సారించడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. అయితే త్వరలోనే విజయ్ ఈ సినిమాను పూర్తి చేయబోతున్నాడట.

వరల్డ్ ఫేమస్ లవర్ ఒక షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందట. త్వరలోనే ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొడతారట. ఇక ఈ సినిమా కు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయట. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ ఒక లవర్ బాయ్.. కాసనోవా తరహా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా థీమ్ కు తగ్గట్టు వాలెంటైన్స్ డే నాడు విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు సమాచారం.

ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గోపి సుందర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమా ను కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ చిత్రానికి సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ 'ఓనమాలు'.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి అభిరుచిగల సినిమాలు తెరకెక్కించినప్పటికీ 'ఉంగరాల రాంబాబు' తో నిరాశ పరిచాడు. మరి ఈ 'వరల్డ్ ఫేమస్ లవర్' లో విజయ్ దేవరకొండ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాలి.