Begin typing your search above and press return to search.

'తుఫాను'లా దూసుకొస్తూ.. హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టిన రౌడీ బాయ్..!

By:  Tupaki Desk   |   1 Feb 2022 4:50 AM GMT
తుఫానులా దూసుకొస్తూ.. హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టిన రౌడీ బాయ్..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ దక్షిణాదిలోనే కాదు.. నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఓవైపు సినిమాలతో పాటు మరోవైపు ఎండోర్స్‌మెంట్స్‌ తో దుమ్మురేపుతున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా ప్రముఖ శీతలపానీయం సంస్థ కోకా కోలాకు చెందిన 'థమ్స్ అప్' కి VD బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా 'తుఫాన్' అంటూ హింట్ ఇచ్చిన రౌడీ బాయ్ విజయ్.. తాజాగా 'థమ్స్ అప్' కి సంబంధించిన ప్రచార వీడియోని రిలీజ్ చేశారు. ‘సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తూఫాన్’ అంటూ పేర్కొన్న విజయ్ దేవరకొండ.. నిజంగానే ఈ యాడ్ లో 'తుఫాను' ఎలా ఉంటుందో చూపించాడు.

థియేటర్ లో ఒక సగటు ప్రేక్షకుడిలా విజయ్ కనిపించడంతో 'థమ్స్ అప్' బ్రాండ్ న్యూ యాడ్ ప్రారంభమవుతుంది. 'సాఫ్ట్ డ్రింక్స్' అంటూ తన వద్దకు వచ్చిన బాయ్ తో.. 'సాఫ్ట్ డ్రింకా?' అంటూ విజయ్ దేవరకొండ బిగ్ స్క్రీన్ వైపు అతడిని చూడమని సూచిస్తాడు. తెరపై హీరోగా ప్రత్యక్షమైన VDని రౌడీలు ఓ కూర్చీకి తాళ్ళతో బంధించి ఉంచుతారు.

అయితే విజయ్ తనదైన శైలిలో చాకచక్యంగా తప్పించుకొని.. ప్రత్యర్థులతో ఫైట్ చేసి వారిని చిత్తు చేయడంతో.. తెరపై చూస్తున్న ప్రేక్షకులు అందరూ క్లాప్స్ కొడుతూ అభినందిస్తున్నారు. చివర్లో విజయ్ దేవరకొండ థమ్స్ అప్ తాగుతూ.. 'సాఫ్ట్ డ్రింక్ కాదు తమ్ముడూ.. తుఫాన్' అని కూల్ డ్రింక్స్ అమ్మే అబ్బాయ్ తో చెప్పి బయటికెళ్లడంతో ఈ యాడ్ ముగుస్తుంది.

ఇదంతా సముద్రంలోని ఓ షిప్ లో జరుగుతున్నట్లు యాడ్ లో చూపించారు. ఇది ప్రచార చిత్రంలో భాగంగా రూపొందించినప్పటికీ.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మరియు విజువల్స్ చూస్తే ఇదొక పెద్ద సినిమా అనే ఫీలింగ్ కలుగుతోందనడంలో అతిశయోక్తి లేదు. హాలీవుడ్ స్థాయి రిస్కీ స్టంట్స్ ఇందులో చూడొచ్చు.

ఇందులో విజయ్ దేవరకొండ చాలా స్టైలిష్ గా యాక్టన్ హీరోని గుర్తు చేస్తున్నారు. వీడీ ఎంట్రీ - అతను చేసే యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఇవే అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. 'థమ్స్ అప్‌' అనేది సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఒక తుఫాన్ అనే విధంగా ఈ యాడ్ రూపొందించబడింది. దీని కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

గతంలో థమ్స్ అప్ ప్రచార చిత్రాలకు మించి ఈ తుఫాన్ యాడ్ కి అనూహ్య రెస్పాన్స్ వస్తోంది. విజయ్ తో చేసిన ఈ శీతలపానీయం ప్రకటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రాబోయే సీజన్ లో కచ్చితంగా సాఫ్ట్ డ్రింక్స్ అమ్మకాల్లో తుఫాన్ సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు.

భారతదేశంలోని కోలా విభాగంలో థమ్స్ అప్ అగ్రగామిగా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పాపులర్ స్టార్స్ దీనికి ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా అవతరించడం విశేషం.