Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ స్పీడు మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   3 Feb 2022 8:00 AM IST
రౌడీ స్టార్ స్పీడు మామూలుగా లేదుగా
X
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీడు మామూలుగా లేదుగా... ఎలాంటి స‌పోర్ట్ లేకుండా.. సినిమా బ్యాగ్రౌండ్ వున్న ఫ్యామిలీ నుంచి కాకుండా ఓ సాధార‌ణ టీవీ న‌టుడు, డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి చిన్న న‌టుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌రువాత త‌ను టాలీవుడ్ లో హీరోగా అంచ‌లంచెలుగా ఎద‌గ‌డం మామూలు విష‌యం కాదు. చాలా ఎదురుదెబ్బ‌ల్ని ఎదుర్కొని `అర్జున్‌రెడ్డి`తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచాడు.

ఈ సినిమా కోసం చాలా శ్ర‌మించి గ‌ట్టి న‌మ్మ‌కంతో ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా నిరుత్సాహ ప‌రిచినా తాము అనుకున్న దాన్ని బ‌లంగా న‌మ్మి చివ‌రికి పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఈ మూవీతో అమ్మాయిల‌కు క‌ల‌ల రాకుమారిడాగా.. అబ్బాయిల‌కు రౌడీ స్టార్ గా మారిపోయి టాలీవుడ్ హీరోల్లో అత్యంత క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోగా నిలిచాడు. ప్ర‌స్తుతం `లైగ‌ర్‌` మూవీతో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు.

పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోవాల‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఆశ‌గా ఎదురుచూస్తున్నాడు. ఆగ‌స్టు 25న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, మిందీ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కాబోతోంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈమూవీ పై భారీ అంచ‌నాలే వున్నాయి. ఈ మూవీ కోసం బాక్స‌ర్‌గా మారిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ని అందించ‌బోతున్నాడు.

ఇదిలా వుంటే ఏదేమైనా కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీడూ మాములుగా లేదు. `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ని టార్గెట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. థ‌మ్స్ అప్ బ్రాండ్ కి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మార‌డం హాట్ టాపిక్ గా మారింది. థ‌మ్స్ అప్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ కాంవ‌డం అంటే మాములు విష‌యం కాదు, చాలా మంది తెలుగు హీరోల‌కి ఇదో క‌ల‌.

దాన్ని చాలా త‌క్కువ స‌మ‌యంలో విజ‌య్ అధిగ‌మించాడ‌నే చెప్పాలి. సో కాల్డ్ స్టార్ హీరోలకి కూడా క‌న్నుకుట్టే విధంగా వీడీ ఈ బ్రాండ్ ని ద‌క్కించుకున్నాడు. `లైగ‌ర్` సినిమా విడుద‌లై మినీమమ్ హిట్ అయితే చాలు వీడి పాన్ ఇండియా స్టార్ అయిపోయిన‌ట్లే.. ఇంత వ‌ర‌కు మ‌న సౌత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ బాబు మాత్ర‌మే థ‌మ్స్ ప్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ లు గా చాలా ఏళ్లు వ్య‌వ‌హ‌రించారు. అలాంటి క్రేజీ బ్రాండ్ కి అన‌తి కాలంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌చార క‌ర్త‌గా మార‌డం నిజంగా గ్రేట్ అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.